India: 50 వేలకు చేరువలో కరోనా మరణాలు

భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు, మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నిత్యం 60 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా దాదాపు వేయి వరకు నమోదవుతోంది.

Last Updated : Aug 16, 2020, 10:55 AM IST
India: 50 వేలకు చేరువలో కరోనా మరణాలు

Covid-19 Positive Cases: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు, మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నిత్యం 60 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా దాదాపు వేయి వరకు నమోదవుతోంది. గత 24 గంటల్లో ( శనివారం ) కొత్తగా  63,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ( Health Ministry ) ఆదివారం తెలిపింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 944 మంది మరణించినట్లు వెల్లడించింది. శనివారం నమోదైన కేసులతో దేశంలో మొత్తం Covid-19 కేసుల సంఖ్య  25,89,682 కు పెరిగింది. కరోనా మరణాల సంఖ్య  49,980కి చేరింది. Also read: Telangana: కొత్తగా 1,102 కరోనా కేసులు.. 9మంది మృతి

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 6,77,444 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18,62,258 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇదిలాఉంటే.. శనివారం 7,46,608 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) తెలిపింది. ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా 2,93,09,703 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.  Also read: MS Dhoni retirement: సాక్షి ఎమోషనల్ పోస్ట్

Trending News