గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రచారాలు మునుపటి కంటే మరింతగా ఊపందుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కూడా గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. బారూచ్, దాంధుకా, దహోడ్ ప్రాంతాల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ప్రచారంలో భాగంగా మోదీ, రాహుల్ గాంధీ గుజరాత్ లోనే మకాం వేశారు.
ఎన్నికల ప్రచారానికి 'ఓఖీ' ఎఫెక్ట్
గుజరాత్ ఎన్నికల ప్రచారంపై 'ఓఖీ' నీళ్లుచల్లింది. తుఫాన్ కారణంగా సూరత్, సౌరాష్ట్ర ప్రాంతాలు, వల్సాడ్, నవసారి, భరూచ్, భావనగర్ తో పాటు గుజరాత్ తీరప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు, ప్రచారాలు, సభలు రద్దు చేశారు. మోర్బి, ద్రంగాధ్ర, సురేంద్ర నగర్ లో రాహుల్ గాంధీ పర్యటనలు రద్దయ్యాయి. సౌరాష్ట్రలోని రాజులా, మహువా, సిహోర్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన రద్దయింది. అయితే ప్రధాని మోదీ ప్రచారంలో పాల్గొంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Will be in Gujarat today, where I would address rallies in Dhandhuka, Dahod and Netrang. @BJP4Gujarat
— Narendra Modi (@narendramodi) December 6, 2017
కాగా ఇప్పటివరకు ఓఖీ తుఫాను కారణంగా తమిళనాడులో 10, కేరళలో 29 మంది మృత్యువాత పడ్డారు. పలు రాష్ట్రాల్లో 167 మంది మత్య్సకారులు గల్లంతయ్యారు.