Delhi Voting Percentage: కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయానికి దారితీసిన అంశాలు చాలా ఉన్నాయి. బీజేపీ విజయానికి ఆ పార్టీ అవలంభించిన వ్యూహాలు, విధానాల కంటే ఆప్ వైఫల్యాలే కారణాలుగా తెలుస్తోంది. అందుకే ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆప్ పరాజయంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది.
ఢిల్లీ పీఠాన్ని వరుసగా మూడు సార్లు అధిరోహించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగోసారి చతికిలపడి బీజేపీకు అధికారం అప్పగించింది. ఓటమి తరువాత కారణాలు చాలానే విశ్లేషించుకోవచ్చు కానీ కొన్ని కారణాలను తీసిపారేయలేం. కచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సిందే. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పరిస్థితి చూస్తే అదే అన్పిస్తోంది. అసలు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు పరాజయం పాలవడంతో పాటు ఆప్ అధికారం కోల్పోయింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఆప్ మధ్య ఓటింగ్ శాతంలో ఉన్న తేడా చూస్తే ఆప్ ఓటమికి కారణం ఏంటనేది తెలుస్తుంది.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కంటే ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ ఓడించిందని చెప్పడం సరైంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీకు వచ్చిన ఓట్ల శాతం 46 కాగా, ఆమ్ ఆద్మీ పార్టీకు 44 శాతం వచ్చాయి. అంటే ఈ ఇద్దరి మధ్య తేడా కేవలం 44 శాతమే. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకు వచ్చిన ఓట్ల శాతం 7. గత ఎన్నికల్లో కంటే కాంగ్రెస్ పార్టీ 3 శాతం ఓట్లు పెంచుకుంది.
అరవింద్ కేజ్రీవాల్ స్వయం కృతాపరాధం, అహం, ఓటింగ్ శాతంలో అంతరం
ఢిల్లీ ఎన్నికల సమయంలో వాస్తవానికి ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఆప్‌లు కలిసి పోటి చేస్తాయని అంతా భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని అరవింద్ కేజ్రీవాల్ అహంకారం ప్రదర్శించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమను కలుపుకోలేదనే కారణంతో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ చేసిన తప్పునే ఇక్కడ చేశారు. అంతే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 2 శాతం ఓట్లతో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ 7 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇద్దరూ కలిసి పోటీ చేసుంటే ఫలితాలు మరోలా ఉండేవనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
బీజేపీ గెలిచిన మెజార్టీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్వల్ప తేడాతోనే విజయం సాధించింది. దాదాపు 15-20 స్థానాల్లో బీజేపీ, ఆప్ పార్టీల మధ్య అంతరం కేవలం 1000-3000 మధ్యే ఉండటం గమనార్హం. వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో ఉండటం, లిక్కర్ స్కాం ఆరోపణలు వంటివి ప్రతికూలంగా మారనున్నాయని తెలిసి కూడా మిత్రుల్ని కలుపుకుని వెళ్లకపోవడం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఘోరమైన తప్పిదం. హర్యానాలో తమను దూరం పెట్టిందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడం వల్ల నష్టం జరిగింది అరవింద్ కేజ్రీవాల్‌కే. ఎందుకంటే అధికారం లేనప్పుడు ప్రాంతీయ పార్టీని నిలబెట్టడం చాలా కష్టమైన పని.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి