ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో(Maharashtra politics) ఎవ్వరూ ఊహించని విధంగా కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(BJP), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) ఎమ్మెల్యేల మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్సీపీ తరపున శరద్ పవార్(Sharad Pawar) సమీప బంధువైన అజిత్ పవార్(Ajit Pawar) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు.
మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శుక్రవారం శరద్ పవార్, శివసేన అధినేత బాల్ థాకరే ప్రకటించడంతో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ పార్టీలు ఓ కూటమిగా ఏర్పడబోతున్నాయని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెళ్లి బీజేపితో జత కట్టడం తీవ్ర చర్చనియాంశమైంది.