Earthquake in Delhi NCR: దేశ రాజధాని ఢిలీని వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4:20 గంటలకు మరోసారి భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఇళ్లలోని నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఆఫీసుల్లో ఉన్న ఉద్యోగులు ఏం జరుగుతోందనని కార్యాలయాలు వీడి బయటకు వచ్చి నిలబడి చూశారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడికావాల్సి ఉన్నాయి. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ నివేదించిన ప్రకారం.. నేపాల్‌లో సోమవారం 5.2 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం 35 కిలోమీటర్ల (21.75 మైళ్ళు) లోతులో సంభవించింది.
కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఆదివారం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌ఎస్‌సీ) ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 1 గంటకు భూకంపం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి నేపాల్ 6.4 తీవ్రతతో నమోదైన భూకంపం.. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (NCR), ఉత్తర భారతదేశంలోని కొన్ని ఇతర ప్రాంతాలను తాకిన విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా నేపాల్‌ను భూకంపాలు భయపెడుతున్నాయి. వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో ఆ దేశ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూమి కంపించగా.. దాదాపు 158 మంది మరణించారు. ఇందుకు సంబంధించి సహాయ చర్యలు కొనసాగుతున్న తరుణంలోనే మళ్లీ భూకంపం నేపాల్‌పై విరుచుకుపడడం ప్రజలను కలవరపడుతున్నారు. ఈ ప్రభావంతో ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి.
Also Read: Anasuya: అలా చేయకపోవడం వల్లే హీరోయిన్ కాలేకపోయా.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook