2022 నాటికి భారతదేశంలో వ్యవసాయం చేసేవారు సంపన్నదారులుగా మారే రోజులు వస్తాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం పుసా క్యాంపస్ ప్రాంతంలోని "కృషి ఉన్నతి మేళా"లో పాల్గొంటున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రైతులకు నూతన సాంకేతికతను, అడ్వాన్సడ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం కోసం తాము తపిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదే కార్యక్రమంలో భారత ప్రధాని కృషి కర్మన్, దీనదయాళ్ ఉపాధ్యాయ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహన్ అవార్డులను బహుకరించనున్నారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారితో పాటు పలువురు రైతులకు ఈ అవార్డులను ప్రభుత్వం అందిస్తోంది. అలాగే సేంద్రీయ వ్యవసాయంపై ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించనున్నారు. 25 కృషి విజ్ఞాన్ కేంద్రాలకు శంఖుస్థాపన కూడా ఇదే కార్యక్రమంలో ఆయన చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ ఫిబ్రవరిలో వ్యవసాయ పద్ధతుల్లో పలు మార్పులను తీసుకొచ్చి.. రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం స్టేక్ హోల్డర్స్‌తో కలిసి చర్చించింది.