వినాయకచవితి వస్తుందంటే చాలు మార్కెట్ లో వివిధ రకాల ఆకృతుల్లో గణపతి విగ్రహాలు తయారవుతుంటాయి. అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ముఖ్యంగా ఆకారం దాల్చుతుంటాయి. ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో బెంగుళూరు శిల్పి రూపొందిస్తున్న గణపతి విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
కరోనా మహమ్మారి తగ్గే సూచనలు కన్పించడం లేదు సరికదా..రోజురోజుకూ విజృంభిస్తోంది. మరి కొన్ని రోజుల్లో వినాయకచవితి రానుంది. ఈ నేపధ్యంలో ఈసారి గణపతి నిమజ్జనం ఎలా ఉంటుందో అనేది అందరికీ ఆసక్తితో పాటు సందేహాస్పదంగా ఉంది. అయితే ప్రతియేటా వినాయకచవితి సందర్బంగా ఊహించని రూపాల్లో వినూత్నంగా గణపతి విగ్రహాలు తయారవుతుంటాయి. అప్పుడున్న పరిస్థితుల్ని ప్రతిబింబించే విధంగా తయారయ్యే విగ్రహాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపధ్యంలో బెంగుళూరుకు చెందిన శ్రీధర్ అనే శిల్పి తయారు చేస్తున్న గణపతి విగ్రహాలు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యుని రూపంలో...కరోనా వైరస్ ను కట్టడి చేస్తూ..తాళ్లతో బంధించిన దేవుడి రూపంలో, మృతి చెందిన కరోనా రోగిని తీసుకెళ్తున్న రూపంలో...ఇలా వివిధ రూపాల్లో ఇష్టదైవం గణపతి విగ్రహాల్ని చక్కగా మలిచాడు శ్రీధర్. Also read: Ayodhya: రాముని ప్రత్యేక వస్త్రాలు సిద్ధం
ప్రస్తుతం మనం కోవిడ్ 19తో పోరాడుతున్నాం. ప్రపంచమంతటా మెరుగైన పరిస్థితులు ఏర్పడాలని గణపతిని ప్రార్ధించాలంటున్నారు ఈ శిల్పి శ్రీధర్. కరోనా ప్రస్తుత పరిస్థితుకు తగ్గట్టుగా తీర్దిదిద్దుతున్న విభిన్న రకాల గణపతి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Also read: Covid19: కేంద్రమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్