Heavy rain in Chennai: చెన్నైలో వర్ష బీభత్సం.. ముగ్గురు మృతి.. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్

Heavy rain in Chennai: చెన్నైలో వర్ష బీభత్సానికి నగరం అతలాకుతలమైంది. వర్షం కారణంగా విద్యుత్ షాక్‌ తగిలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్ల పైకి భారీగా వర్షపు నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 08:01 AM IST
  • చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం
  • విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి
  • రోడ్ల పైకి భారీగా వర్షపు నీరు
  • రోడ్లపై కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
Heavy rain in Chennai: చెన్నైలో వర్ష బీభత్సం.. ముగ్గురు మృతి.. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్

Heavy rain in Chennai: చెన్నైని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం (డిసెంబర్ 30) భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. రోడ్ల పైకి భారీగా వర్షపు నీరు చేరడంతో నగరంలో చాలాచోట్ల ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలో మీటర్ల మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. వర్షం కారణంగా విద్యుత్ షాక్‌ తగిలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 70 ఏళ్ల వృద్దురాలు, 45 ఏళ్ల మహిళ, 13 ఏళ్ల బాలుడు ఉన్నారు.

వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం... ఎంఆర్‌సీ నగర్‌లో అత్యధికంగా 17.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. నుంగంబాక్కంలో 14.65 సెం.మీ, మీనంబాక్కంలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో 1సెం.మీ నుంచి 10 సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాబోయే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

భారీ వర్షానికి (Heavy rains in Chennai) ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడటంతో చాలామంది ప్రయాణికులు నరకం అనుభవించారు. ఇదే అదనుగా క్యాబ్ డ్రైవర్స్ ప్రయాణ ఛార్జీలను భారీగా పెంచేశారు. ఈ నేపథ్యంలో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చెన్నై మెట్రో సేవలను అర్ధరాత్రి వరకు పొడగించారు. రోడ్ల పైకి చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు 145 పంపులను వినియోగిస్తున్నామని... ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయని చెన్నై కార్పోరేషన్ కమిషనర్ గంగదీప్ సింగ్ బేటీ వెల్లడించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పలువురు మంత్రులు విజ్ఞప్తి చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల వివరాలను సీఎం స్టాలిన్ (CM MK Stalin) ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

Also Read: Todays Gold Rate : తెలుగు రాష్ట్రాలు సహా దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరల వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News