Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వాతావరణం మారిపోయింది. గత రెండ్రోజులుగా తెల్లవారుజామున భారీ వర్షం కురుస్తోంది. మరో రెండ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో వర్షాలు తక్కువే. మరోవైపు వాతావరంలో హ్యుమిడిటీ కారణంగా ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణంతో కాస్త రిలీఫ్ లభిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో ఇప్పటికే రోజూ తెల్లవారుజామున మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణం కాస్త మేఘావృతమై కన్పిస్తోంది. రానున్న రెండ్రోజులు ఏపీ , తెలంగాణలోని కొన్నిజిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ అయింది.
అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక ఉంది. ఏపీలో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, ఎన్టీఆర్, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో రెండ్రోజుల్నించి తెల్లవారుజామున మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది.
హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం దంచి కొడుతోంది. ఎస్సార్ నగర్, అమీర్ పేట్, బోరబండ, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్, ఉప్పల్, అంబర్ పేట్, నాగోల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్ పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఏపీలో 15 జిల్లాలకు, తెలంగాణలో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు లెక్కలు ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook