Summer Weather Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అప్పుడే వేసవి ఎఫెక్ట్ కన్పిస్తోంది. పగటి పూట ఎండల తీవ్రత అధికమౌతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేటి నుంచి ఎండలు పెరగనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలో 2-3 డిగ్రీలు పెంపు ఉండవచ్చని అంచనా. వాతావరణంలో స్పష్టమైన మార్పు కూడా కన్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి మొదలైపోయింది. పగటి ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా పెరుగదల కన్పిస్తోంది. రెండ్రోజుల్నించి ఎండల తీవ్రత అధికంగా ఉంది. దాహం ఎక్కువౌతోంది. ఇవాళ్టి నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 33 డిగ్రీలు నమోదు కాగా రాత్రి వేళ 20 డిగ్రీలు నమోదైంది. గాలులు వీస్తున్నాయి. పశ్చిమ తెలంగాణ ప్రాంతంలో వేడి ఎక్కువగా కన్పిస్తోంది.
ఇక ఏపీలో కూడా అదే పరిస్థితి. రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి వేళ 22 డిగ్రీల వరకూ ఉంటోంది. పగటి వేళ వాతావరణం చాలా పొడిగా ఉండటంతో దాహం ఎక్కువగా ఉంటోంది. ఇక క్రమేపీ ఎండల తీవ్రత పెరగనుందని ఐఎండీ వెల్లడించింది. గత ఏడాది వేసవి తీవ్రత చాలా అధికంగా ఉంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.
వేసవి తీవ్రత అధికమయ్యే కొద్దీ డీ హైడ్రేషన్ సమస్యలు పెరగనున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజంతా ఎక్కువ నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. పుచ్చకాయ, దోసకాయ వంటి వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు తినాలని చెబుతున్నారు.
Also read: Supreme Court: పతంజలి ప్రకటనలపై నిషేధం, కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ, కేంద్రంపై ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook