Corona Cases In India: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య (Corona Cases Update) భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,822 మందికి కరోనా సోకగా.. 220 మంది కొవిడ్ ధాటికి బలయ్యారు. మరోవైపు 10,004 మంది కరోనా వైరస్ నుంచి విముక్తి పొందారు. రోజువారీ కేసుల సంఖ్య 558 రోజుల కనిష్టానికి చేరింది.
ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,46,38,383 కరోనా కేసులు నమోదయ్యయి. ఇదిలా ఉండగా.. కొవిడ్ మహమ్మారి ధాటికి 4,73,757 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం లక్షకు తక్కువగా.. అంటే 95,014 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారి నుంచి ఇప్పటి వరకు 3,40,79,612 మంది కోలుకున్నారు.
#COVID19 | India reports 6,822 new cases (lowest in 558 days), 10,004 recoveries and 220 deaths in the last 24 hours. Active caseload currently stands at 95,014 - lowest in 554 days: Ministry of Health and Family Welfare
128.76 crore vaccine doses have been administered so far. pic.twitter.com/ryauaLnq2u
— ANI (@ANI) December 7, 2021
వ్యాక్సినేషన్..
దేశంలో టీకా పంపిణీ వేగంగానే కొనసాగుతోంది. మరో 79,39,038 మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,28,76,10,590కు చేరింది.
ప్రపంచంలో కరోనా కేసులు..
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో.. అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా వివిధ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాల్లో కలిపి 24 గంటల వ్యవధిలో 4,47,937 కేసులు (Worldwide Corona Cases) నమోదయ్యాయి. 5,392 మంది మరణించారు.
Also Read: Woman raped by SI: మోసపోయానని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై ఎస్సై అత్యాచారం
Also Read: Covid Third Wave: కర్ణాటకలో కరోనా థర్డ్‌వేవ్ భయం, వందమంది విద్యార్దులకు కరోనా పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook