స్కూల్స్ ( Schools ) తిరిగి ప్రారంభించడంపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల వాదనలు విన్పిస్తున్నాయి. కొంతమంది సెప్టెంబర్ 5 నుంచి అంటుంటే..మరి కొంతమంది సెప్టెంబర్ నెలాఖరుకు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ఎలా ఉన్నా సరే...అసలు తల్లిదండ్రులు ( parents opinion ) ఏమనుకుంటున్నారనే విషయంపై ప్రముఖ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ సర్వే ( Local circles survey ) లో ఏం తేలింది..స్కూల్స్ తెరవడానికి తల్లిదండ్రులు ఓకే అనేశారా ?
కరోనా నేపధ్యంలో స్కూల్స్ రీ ఓపెన్ ( Schools re open ) పై తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ ఓ సర్వే ( local circles survey ) నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్నించి 25 వేలమంది తల్లిదండ్రులు ( 25 thousand of parents ) ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ ( schools from september 1st ) తెరవాలా వద్దా అని ప్రశ్నించగా...33 శాతం తల్లిదండ్రులు ఓకే చెప్పారు. అయితే 58 శాతం మంది మాత్రం ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్సూల్స్ అప్పుడే తెరవద్దని అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ ( Corona virus ) పట్ల భయం, సోషల్ డిస్టెన్సింగ్ ( Social distance ) పాటించడంలో సమస్యలు, ఇంట్లో వృద్ధులకు ఎదురయ్యే సమస్యలు ఉంటాయని అధిక శాతం తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఏ కారణంతో వద్దన్నారనేది కూడా సర్వేలో వివరంగా తేలింది. ఈ నేపధ్యంలో రిస్క్ తీసుకోదల్చుకోలేదని మరో 13 శాతం మంది చెప్పారు. పిల్లల్ని స్కూల్స్ కు పంపితే ఇంట్లో వృద్దులకు రిస్క్ ఉంటుందని 1 శాతం మంది అభిప్రాయపడ్డారు. స్కూల్స్ లో సోషల్ డిస్టెన్సింగ్ అనేది సాధ్యం కాదని 9 శాతం మంది చెప్పారు. స్కూల్స్ తెరిస్తే వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని 5 శాతం మంది స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్ లైన్ క్లాసులే బెస్ట్ అని 2 శాతం మంది తెలిపారు. Also read: America Lesson: స్కూళ్లు తెరిచారా..అంతే సంగతులు
భారతదేశంలో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య 22 లక్షలు దాటింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ప్రకారం పిల్లలు హై రిస్క్ కేటగరీలో ఉన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ లలో ( America and Izrael ) స్కూల్స్ తెరవడం వల్ల వేలాది మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో భారత్ లో ఆచితూచి సరైన నిర్ణయం తీసుకోకపోతే..అమెరికా, ఇజ్రాయిల్ పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. Also read: Rare Animal in Western Ghats: అత్యంత అరుదైన జంతువిది..పేరేంటో తెలుసా