అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, డొనాల్డ్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భాగ్యనగరానికి చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3: 30 గంటలకు అమెరికా నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, భారత్ లో ఉన్న అమెరికా రాయబారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అహీకారులతో కొద్దిసేపు ముచ్చటించిన ఇవాంకా ట్రంప్ అక్కడి నుండి అత్యంత కట్టుదిట్టమైన భద్రతమధ్య ప్రత్యేక వాహనంలో మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. ఇవాంకా ట్రంప్ మధ్యాహ్నం 2 గంటలవరకు హోటల్ లోనే ఉండి విశ్రాంతి తీసుకొని 3:00 pm కు హెచ్ఐసీసీ లో జీఈఎస్ జరుగుతున్న జీఈఎస్-8 సదస్సుకు హాజరవుతారు.
#WATCH Ivanka Trump arrived in Hyderabad, late last night; will be attending Global Entrepreneurship Summit #GES2017 pic.twitter.com/3FozL12bF4
— ANI (@ANI) November 28, 2017
ఇవాంకా ట్రంప్ పర్యటన షెడ్యూల్ వివరాలు
నవంబర్ 28వ తేదీ..
- మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ఐసీసీ జీఈఎస్ సదస్సుకు హాజరు
- భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో హెచ్ఐసీసీ రెండో అంతస్థులో భేటీ
- జీఈఎస్ సదస్సు ప్రారంభం అయ్యాక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుస్తారు
- కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, ఇతర మహిళా ప్రతినిధులతో కలిసి మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, అభివృద్ధి తదితర అంశాలపై చర్చలో పాల్గొంటారు
- జీఈఎస్ సదస్సు మొదటి రోజు ముగిసిన అనంతరం రాత్రి 8 గంటలకు పాతబస్తీలోని ఫలక్ నూమా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. భారత సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శన ను తిలకిస్తారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తే వారితో కలిసి డాన్స్ చేయవచ్చు.
- విందు ముగిసిన అనంతరం రాత్రి 10:45 గంటలకు మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ కు చేరుకుంటారు.
29వ తేదీ
- బుధవారం ఇవాంకా ట్రంప్ ఉదయం మరోసారి హెచ్ఐసీసీ సదస్సుకు వెళ్తారు.
- మధ్యాహ్నం 12 గంటలకు హెచ్ ఐ సీసీ సదస్సు నుండి బయటకు వస్తారు
- ఇవాంకాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం గోల్కొండ హోటల్ లో లంచ్ ఏర్పాటు చేయనుంది. అయితే.. ఇందుకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్ ఖరారు కాలేదు. కానీ భద్రతా బలగాలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
- ఇవాంకా మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ట్రైడెంట్ హోటల్ కు చేరుకుంటారు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని .. సాయంత్రం అమెరికా ప్రతినిధులతో భేటీ అవుతారు.
- బుధవారం రాత్రి 9:20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుండి దుబాయ్ కు వెళ్తారు.