Jharkhand To Telangana: భూ కుంభకోణం తదితర కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేయడంతో జార్ఖండ్‌లో ప్రభుత్వం సంక్షోభం తలెత్తింది. రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ ప్రమాణస్వీకారం చేయగా.. అసెంబ్లీలో బల పరీక్ష ఈనెల 5వ తేదీన చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. అయితే ఆ క్యాంపులు తెలంగాణలో జరుగుతుండడం గమనార్హం. జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుండడం విశేషం.
హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి శామీర్‌పేట్‌లోని లియోనియో రిసార్ట్‌కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఎమ్మెల్యేలను రెండు బస్సుల్లో రిసార్ట్‌కు తరలించారు. శామీర్‌పేట్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపు ఏర్పాటు చేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న విషయం తెలిసిందే. బల నిరూపణ సమయంలో ఎమ్మెల్యేలు చీలకుండా ఇలా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నారు.
వివాదం ఇలా.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని 12 ప్రాంతాల్లో హేమంత్ సోరెన్ 8.5 ఎకరాలు ఆక్రమించారనే అభియోగాలు నమోదయ్యాయి. మనీ ల్యాండరింగ్ కేసు కూడా నమోదైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఈడీ విచారణకు రావాలని సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌కు వరుసగా నోటీసులు పంపించింది. ఎన్ని నోటీసులు ఇచ్చినా హేమంత్ స్పందించకపోవడంతో ఇటీవల ఆయనను అరెస్ట్ చేసింది. దీంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామాతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
VIDEO | MLAs of JMM, RJD, Congress and other ruling parties board a special chartered flight from Ranchi to Hyderabad amid political turmoil in #Jharkhand.
(Source: Third Party) pic.twitter.com/lQ9zBvqMEH
— Press Trust of India (@PTI_News) February 2, 2024
జార్ఖండ్‌లో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారంలో ఉండాలంటే కావాల్సిన బలం 42 మంది ఎమ్మెల్యేలు. జేఎంఎం, కాంగ్రెస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కలిపి 45 మంది బలం ఉంది. బల నిరూపణకు సమయం ఇవ్వడంతో ఈలోపు ఎమ్మెల్యేలు చేజారుతారనే భయంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. 36 మంది ఎమ్మెల్యేలను సురక్షితంగా తెలంగాణలో దింపారు. బల నిరూపణ రోజు ఎమ్మెల్యేలంతా మళ్లీ రాంచీకి వెళ్లనున్నారు. నేరుగా అసెంబ్లీకి చేరుకుని మెజార్టీ నిరూపించేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఆరోజు దాకా ఎమ్మెల్యేలు ఉంటారో లేదో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జార్ఖండ్ బలనిరూపణపై దేశం దృష్టి ఉంది.
క్యాంపు రాజకీయాలకు అడ్డాగా తెలంగాణ
కాగా తెలంగాణ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు కొనసాగడం ఇప్పుడు కొత్త కాదు. గతంలో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో అక్కడి ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు నడిపారు. జార్ఖండ్ రాజకీయం కూడా తెలంగాణకు మారడంతో మరోసారి హైదరాబాద్ చర్చనీయాంశంగా మారింది.
Also Read: Gaddar Awards: 'గద్దర్ అవార్డు'లపై సినీ పరిశ్రమ మౌనం.. తొలిసారి మోహన్ బాబు ఏమన్నారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook