Babri Demolition: బాబ్రీతీర్పు అనంతరం న్యాయమూర్తి పదవీ విరమణ..కారణం?

బాబ్రీ మసీదు విధ్వంసం కేసు తీర్పు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వెలువడింది. నిందితులంతా నిర్దోషులేనని తీర్పు ఇచ్చిన ఆ న్యాయమూర్తి..కాస్సేపటికి రిటైరయ్యారు. కారణమేంటి?

Last Updated : Sep 30, 2020, 06:55 PM IST
Babri Demolition: బాబ్రీతీర్పు అనంతరం న్యాయమూర్తి పదవీ విరమణ..కారణం?

బాబ్రీ మసీదు విధ్వంసం కేసు ( Babri masjid demolition case ) తీర్పు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వెలువడింది. నిందితులంతా నిర్దోషులేనని తీర్పు ఇచ్చిన ఆ న్యాయమూర్తి..కాస్సేపటికి రిటైరయ్యారు. కారణమేంటి?

1992 డిసెంబర్ 6వ  ( !992 December 6 ) తేదీన అయోధ్యలోని బాబ్రీ మసీదు ( Babri mosque ) విధ్వంసమైంది. రామ మందిర ఉద్యమంలో భాగంగా లక్షలాదిగా కరసేవకులు బాబ్రీ మసీదు ప్రాంతానికి తరలివచ్చారు. చూస్తుండగానే చారిత్రాత్మక బాబ్రీ మసీదు ధ్వంసమైంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ( CBI ) ఎల్ కే అద్వానీ ( LK Advani ) , మురళీ మనోహర్ జోషి ( Murali manohar joshi ) సహా 32 మందిపై అభియోగాలు మోపింది. అయితే వీరంతా నేరం చేశారనడానికి ఎటువంటి ఆధారాల్లేవని...కుట్ర లేదని అందర్నీ నిర్దోషులుగా ప్రకటిస్తూ… సీబీఐ కోర్టు న్యాయమూర్తి సురేంద్ర యాదవ్ సంచలనమైన తీర్పు ఇచ్చారు. 

28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ కలిగిన కేసులో ఈ తీర్పు అనంతరం న్యాయమూర్తి సురేంద్ర యాదవ్ ( Justice Surendra yadav ) రిటైరయ్యారు. వాస్తవానికి న్యాయమూర్తి సుకేంద్ర యాదవ్ గత ఏడాది రిటైర్ కావలసి ఉంది. కానీ బాబ్రీ మసీదు కేసు లో పూర్తి న్యాయపరమైన తీర్పును వెలువరించే క్రమంలో భాగంగా… సుప్రీంకోర్టు సురేంద్ర యాదవ్ పదవీ కాలాన్ని ఒక ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఆయన పదవి కాలం నేటితో ముగిసింది. అందుకే బాబ్రీ మసీదులో తీర్పు ముగియగానే...ఆయన రిటైరయ్యారు. Also read: Babri Demolition verdict: తీర్పుపై ఎల్ కే అద్వానీ ఏమన్నారో తెలుసా

 

Trending News