భోపాల్: అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజ (Bhoomi Pujan in Ayodhya), శంకుస్థాపన ఆగస్టు 5న జరగనున్న తరుణంలో దేశ వ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఆ చారిత్రక ఘట్టానికి ఒక్కరోజు ముందు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ (Kamal Nath) నేడు భోపాల్లోని తన నివాసంలో హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎట్టకేలకు అయోధ్యలో రామాలయం నిర్మాణం బుధవారం జరబోతున్నందున అది చారిత్రకమైన రోజు అని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
#WATCH: Hanuman Chalisa recital organised at former Madhya Pradesh CM and senior Congress leader Kamal Nath's residence in Bhopal. pic.twitter.com/3nQNRZ3hn6
— ANI (@ANI) August 4, 2020
మధ్యప్రదేశ్ ప్రజల తరఫున, కాంగ్రెస్ తరఫున 11 వెండి ఇటుకలను అయోధ్యకు పంపనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలు నుంచి సేకరించిన విరాళాలతో రామ మందిరానికి ఇటుకలు తయారుచేపించామని చెప్పారు. రేపటి చారిత్రక రోజును పురస్కరించుకుని ముందురోజు ఇక్కడ హనుమాన్ చాలీసా పఠనం చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. Ram mandir: భూమి పూజ తొలి ఆహ్వానం అందుకుంటున్న ఇక్బాల్ ఎవరు ?