భీవండిలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన (Bhiwandi Building Collapse)లో మరణాల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం నాటికి 35 మంది ఈ ప్రమాదంలో మరణించారని (Bhiwandi Building Collapse Death Toll) ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది తెలిపారు. కాగా, మంగళవారం ఉదయం ఈ సంఖ్య 20కి చేరగా.. శిథిలాలు తొలగించేకొద్దీ మృతదేహాలు కనిపిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, మహారాష్ట్రలోని ముంబైలోని భీవండిలో భవనం సోమవారం తెల్లవారుజామున కుప్పకూలడం తెలిసిందే.
#WATCH Maharashtra: Rescue operation continues at Bhiwandi building collapse site in Mumbai.
35 people have died in the incident. pic.twitter.com/zHqeIWHiJ4
— ANI (@ANI) September 23, 2020
మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ఇప్పటివరకూ దాదాపు 30 మందిని రక్షించినట్లు సమాచారం. శిథిలావస్థకు చేరుకోవడంతోనే భవనం కుప్పకూలినట్లు తెలుస్తోంది. గాఢనిద్రలో ఉన్న సమయంలో భవనం కుప్పకూలడంతో మరణాల సంఖ్య అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై వేటు పడింది. Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి భారీగా పతనం
ఫొటో గ్యాలరీలు
-
నటి అన్వేషి జైన్ బ్యూటిఫుల్ ఫొటోస్
-
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
- Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe