Mal River Flash Flood in Japlaiguri: పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జల్పైగురి మల్బజార్ వద్ద దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనం జరుగుతున్న సమయంలోనే మల్ నది ఉప్పొంగి వరదలు పోటెత్తాయి. చూస్తుండగానే కళ్లముందు క్షణాల వ్యవధిలో పెరిగిన వరదల్లో పదుల సంఖ్యలో జనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇప్పటికే ఏడుగురు మృతి చెందినట్టుగా అధికారులు ధృవీకరించారు. ఇంకా పదుల సంఖ్యలో జనం గాయపడగా.. ఇంకొంత మంది ఆచూకీ గల్లంతయ్యింది. గల్లంతయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Flash flood at the Malbazar river during Durga Viserjan. More than 100 people missing. No one knows how many dead! Many trying to save their loved ones! A black day for my home town. We need all your prayers. Pray for us.. pic.twitter.com/RCWwpt5bVW
— Vikram Agarwal (@Vikram_Tub) October 5, 2022
జల్పైగురిలో దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనంలో విషాదం గురించి తెలుసుకున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జి హుటాహుటిన రెస్క్యూ ఫోర్స్‌ను అక్కడికి పంపించి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ దుర్ఘన చోటుచేసుకుంది. రాత్రి వేళ కావడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. పదుల సంఖ్యలో భక్తుల ఆచూకీ గల్లంతవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. జల్పైగురి ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Also Read : Ravan Effigy Collapsed: రావణ దహనంలో అపశృతి.. మంటలతో జనంపై కూలిన రావణుడి బొమ్మ.. వీడియో
Also Read : Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ పెళ్లి బస్సు.. 25 మంది జలసమాధి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి