Chiru Legacy Comments: మగ ఆడ వారసత్వంపై చిరంజీవి వ్యాఖ్యలపై దుమారం, భారీగా విమర్శలు

Chiru Legacy Comments: తెరపై, వేదికలపై ఎన్నెన్ని మాటలు చెప్పినా ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ఇంకా ఆడ-మగ అంతరం ఉండనే ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఆడపిల్లలు వద్దు..మగ పిల్లోడు కావాలని సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 13, 2025, 10:54 AM IST
Chiru Legacy Comments: మగ ఆడ వారసత్వంపై చిరంజీవి వ్యాఖ్యలపై దుమారం, భారీగా విమర్శలు

Chiru Legacy Comments: ఆడపిల్ల పుడితే వంశం ఆగిపోతుందా..మగపిల్లోడైతేనే వంశం నిలుబడుతుందా..ఇదేదో పాతకాలం మనుషుల ఆలోచనలు కాదు. ఇప్పుడు కూడా తెరపై, సమాజంలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్నవాళ్లు చెబుతున్న మాటలు అంటూ.. ప్రముఖ హాస్య నటుడి బ్రహా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగుతోంది.. 

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ రాజా నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ఫిబ్రవరి 14 రేపు విడుదల కానుంది. రెండ్రోజుల క్రితం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రామ్ చరణ్ కూతురు క్లీంకార, ఇతర మనవరాళ్లతో ఉన్న ఫోటో స్క్రీన్‌పై చూపించి యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు చిరంజీవి ఇచ్చిన సమాధానం వివాదాస్పదంగా మారింది. మనవరాళ్లతో తన ఇళ్లు ఓ లేడీ హాస్టల్‌లా ఉందని, తాను వార్డెన్ అని ఛలోక్తి విసిరారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ తరువాత చేసిన వ్యాఖ్యలే దుమారానికి కారణమయ్యాయి. 

చిరంజీవి మాటల్లో...

రాంచరణ్‌కు కూతురు ఉంది. మళ్లీ కూతురే పుడుతుందేమోనని భయపడుతున్నాను. రాంచరణ్‌కు కొడుకు పుట్టాలని నాకు కోరికగా ఉంది. చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగపిల్లాడు కూడా లేడు. వారసత్వం కోసం మగపిల్లాడిని కనాలని రాంచరణ్‌కు సలహ ఇచ్చాను.

ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మగపిల్లోడు కూడా ఉంటే బాగుంటుంది అనుకోవడంలో తప్పులేదు కానీ కూతురు పుడుతుందేమోనని భయపడుతున్నాననడం, వారసత్వం కోసం మగపిల్లోడిని కనాలని సలహా ఇచ్చాననడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. తెరపై పెద్దమనిషిగా, నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అసలు పుట్టే పిల్ల జెండర్ నిర్ణయించడం మన చేతుల్లో లేదనే కనీస ఇంకిత జ్ఞానం చిరంజీవికి లేకపోవడం శోచనీయమంటున్నారు. మగపిల్లలే వారసులు అనే అభిప్రాయంలో చిరంజీవి ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ఆడపిల్లలు వారసులు కారా అని కామెంట్లు చేస్తున్నారు. పెళ్లయ్యాక ఇంటి పేరు మారినంత మాత్రాన రక్తం మారిపోతుందా అని మండిపడుతున్నారు. 

ఈ కాలంలో కూడా ఆడ-మగ జెండర్ ఫీలింగ్ మాటలు చిరంజీవి స్థాయి వ్యక్తులు మాట్లాడటం మంచిది కాదంటున్నారు. రాంచరణ్ ఇంకో ఆడబిడ్డను కంటాడేమోనని భయం వేస్తుందనడం సరైంది కాదంటున్నారు.  

Also read: 8th pay Commission Gift: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్, ఆ ఉద్యోగులకు జీతం లక్ష దాటుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News