Navjot Singh Sidhu: సోనియా ఆదేశాలతో పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడిగా తప్పుకున్న సిద్ధూ

Navjot Singh Sidhu: కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్​ పదవకి రాజీనామా చేశారు. అంతకు ముందు ఉత్తరా ఖండ్​ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 01:57 PM IST
  • ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్​ పార్టీలు చర్యలు
  • పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ రాజీనామా
  • అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం
Navjot Singh Sidhu: సోనియా ఆదేశాలతో పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడిగా తప్పుకున్న సిద్ధూ

Navjot Singh Sidhu: ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్​, ఉత్తరాఖండ్, మణిపూర్​, గోవా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్​ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటిమికి బాధ్యత వహిస్తూ.. ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్​లు రాజీనామా చేయాలన్ని అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందిన విషయం తెలిసింది. సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉత్తర ఖండ్ పీసీసీ అధ్యక్షుడు గణేశ్​ గోడియాల్ రాజీనామా చేశారు.

ఇక తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విట్టర్​లో సోనియా గాంధీకి పంపిన తాన రాజీనామా లేఖను పోస్ట్​ చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు నేను రాజీనామా చేశానంటూ తెలిపారు సిద్దూ.

ఇక మిగతా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు కూడా త్వరలోనే రాజీనామా చేసే వీలుంది. 

ఎన్నికల్లో ఓటమి తర్వాత అధిష్ఠానం సీరియస్​..

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. ఇందులో భాగంగా ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసి.. సోనియా, రాహుల్​, ప్రియాంకలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే సీడబ్ల్యూసీ సభ్యులు ఆ ప్రతిపాపదనను తిరస్కరించారు. కాగా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్​ పార్టీ క్యాడర్​ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్​లను తప్పించనట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో యువతకు అవకాశమిచ్చే వీలుంది.

Also read: Sonia Gandhi: ఐదురాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాలని సోనియా ఆదేశం!

Also read: India Corona Update: దేశంలో కొత్తగా 2,876 మందికి కొవిడ్​- తగ్గిన యాక్టివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News