NCP MLA Bharat Bhalke Passes away: పూణే: కరోనా మహమ్మారి ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎమ్మెల్యే భరత్ భాల్కే (Bharat Bhalke ) శనివారం కన్నుమూశారు. అక్టోబరు 30న ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ భాల్కేకు కరోనావైరస్ (Coronavirus) పాజిటివ్‌గా తేలింది. దీంతో పూణే నగరంలోని రూబీ ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తర్వాత ఆయనకు పలు అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో మళ్లీ నవంబరు 9న ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శనివారం ఉదయం కన్నుమూశారు.
ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ భాల్కే (NCP MLA Bharat Bhalke) మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని పంధర్పూర్-మంగళవేద నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత ఎన్‌సీపీ నుంచి పోటీ చేసి భాల్కే విజయం సాధించారు. ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో.. సమచారం అందుకున్న ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఆసుపత్రికి చేరుకోని శుక్రవారం సాయంత్రం భాల్కేను పరామర్శించారు. ఆయన మరణం పట్ల పలువురు నాయకులు విచారం వ్యక్తం చేశారు. Also read: GHMC Elections 2020: బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు
Also read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe