LPG Gas: గ్యాస్ వినియోగదారులు ఇకపై ఓటీపి ( OTP ) ఉంటేనే గ్యాస్ సిలిండర్ ను పొందగలరు. ఆయిల్ కంపెనీలు కొత్తగా డెలివరీ ఆథెన్టికేషన్ కోడ్ ( DAC ) అనే విధానాన్ని ప్రామాణికంగా పెట్టనున్నాయి అని సమాచారం. నవంబర్ 2020 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది అని సమాచారం.
READ ALSO: Amazon, Flipkart భారీ సేల్, అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో
ఈ డిలవరీ ప్రాసెస్ చాలా సరళంగా ఉంటుంది. ఎవరైనా గ్యాస్ సిలిండర్ ( LGP Gas ) బుక్ చేస్తే వారి రిజిస్టర్ మొబైల్ కోడ్ వస్తుంది. డిలవరీ సమయంలో ఈ కోడ్ చూపించాల్సి ఉంటుంది. దీని వల్ల గ్యాస్ సిలిండర్ కరెక్ట్ వ్యక్తికే చేరింది అనేది నిర్ధారణ జరుగుతుంది.
కొత్త సిస్టమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
డిలవరీ ఆథెన్టికేషన్ కోడ్ ( DAC ) ను ముందు 100 స్మార్ట్ నగరాల్లో పరిచయం చేయనున్నారు. ప్రస్తుతం జైపూర్, రాజస్థాన్ లో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు.
- ఈ 100 నగరాల తరువాత ఇతర నగరాలకు విస్తరించనున్నారు.
READ ALSO: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?
- కమర్షియల్ సిలిండర్లకు ఈ సిస్టమ్ వర్తించదు.
- గ్యాస్ బుక్ చేసిన వెంటనే రిజిస్టర్ నెంబర్ పై ఒక కోడ్ వస్తుంది. దాన్ని చూపిస్తే గ్యాస్ సిలిండర్ ఇస్తారు.
- కస్టమర్ మొబైల్ నెంబర్ అప్డేట్ అయితే డిలవరీ చేసే వ్యక్తి రియల్ టైమ్ లో కోడ్ జెనరేట్ చేయగలడు.
- తప్పుడు చిరునామా, వివరాలతో గ్యాస్ పొందడానికి ప్రయత్నించే వారికి చెక్ పెట్టడానికి ఇలా కొత్త విధానం తీసుకొచ్చారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR