Bihar: ముఖ్యమంత్రిగా నితీష్..ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతల ప్రమాణం

బీహర్ రాజకీయాల్లో నితీష్ కుమార్ చరిత్ర సృష్టించారు. ఏడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ తో పాటు మరో ఆరుగురు కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరికి అవకాశం లభించిందంటే..

Last Updated : Nov 16, 2020, 05:33 PM IST
  • బీహార్ లో 7 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్
  • ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు తార్ కిషోర్ ప్రసాద్, రేణు దేవి
  • జేడీయూ నేతలు నలుగురికి కేబినెట్ లో స్థానం
Bihar: ముఖ్యమంత్రిగా నితీష్..ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతల ప్రమాణం

బీహర్ ( BIhar ) రాజకీయాల్లో నితీష్ కుమార్ చరిత్ర సృష్టించారు. ఏడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ తో పాటు మరో ఆరుగురు కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరికి అవకాశం లభించిందంటే..

బీహార్ ఎన్నికల్లో( Bihar Elections ) విజయం సాధించిన ఎన్డీయే ( NDA ) కూటమి తరపున జేడీయూ నేత నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఏడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు నితీష్ కుమార్ ( Nitish kumar ). ఇవే తన చివరి ఎన్నికలంటూ ప్రచారంలో చెప్పిన నితీష్ కుమార్..ఐదేళ్లు పూర్తిగా కొనసాగితే..బీహార్ చరిత్రలోనే అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రి చేసిన మరో ఘనతను దక్కించుకుంటారు. అగ్రకులం నుంచో..మెజార్టీ కులం నుంచో కాకుండా..కేవలం 2 శాతం ఓట్లున్న కుర్మి సామాజికవర్గం నుంచి ఎదిగి..అత్యధిక కాలం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేయడమంటే సాధారణ విషయం కాదు. ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా పోటి చేసిన నితీష్ సారధ్యంలోని జేడీయూ ( JDU ) కేవలం 15.4 శాతం ఓట్లతో 43 స్థానాల్లోనే విజయం సాధించింది. 

ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ( CM Nitish kumar ) ప్రమాణ స్వీకారం చేయగా..ప్రతిపాదిత రెండు ఉప ముఖ్యమంత్రుల పదవుల్ని భాగస్వామ్య పార్టీ బీజేపీ చేజిక్కించుకుంది. బీజేపీ ( Bjp ) నేతలు తార్ కిషోర్ ప్రసాద్,  రేణుదేవిలు బీహార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు జేడీయూ ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవాలాల్ చౌదరిలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Also read: WhatsApp Pay: వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు

Trending News