Rajastan crisis: పైలట్ చేతుల్లో ఏం లేదు.. డ్రామా అంతా బీజేపిదే: అశోక్ గెహ్లట్

Rajasthan Political Crisis: రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీవ్ర ( CM Ashok Gehlot ) అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయంలో సచిన్ పైలట్ ( Sachin Pilot ) చేతుల్లో ఏమీ లేదని.. బీజేపీనే ఈ డ్రామాను అంతా నడిపిస్తోంది అని అశోక్ గెహ్లట్ మండిపడ్డారు.

Last Updated : Jul 14, 2020, 06:17 PM IST
Rajastan crisis: పైలట్ చేతుల్లో ఏం లేదు.. డ్రామా అంతా బీజేపిదే: అశోక్ గెహ్లట్

Rajasthan Political Crisis: రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీవ్ర ( CM Ashok Gehlot ) అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయంలో సచిన్ పైలట్ ( Sachin Pilot ) చేతుల్లో ఏమీ లేదని.. బీజేపీనే ఈ డ్రామాను అంతా నడిపిస్తోంది అని అశోక్ గెహ్లట్ మండిపడ్డారు. బీజేపీనే ఆ రిసార్టును ఏర్పాటు చేసిందని.. వాళ్లే కాంగ్రెస్ నేతలను మేనేజ్ చేస్తున్నారని అశోక్ గెహ్లాట్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయేలా చేసిన బీజేపీ ( BJP ) బృందమే ప్రస్తుతం రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చురుకుగా పనిచేస్తోంది అని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ( Also read: Sachin Pilot: సత్యాన్ని ఓడించలేరు )

ఇదిలావుంటే, రాజస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సతీష్ పునియా ( Rajasthan BJP president Satish Poonia ) స్పందించారు. రాజస్తాన్ ప్రజలు ఇక్కడి కాంగ్రెస్ సర్కార్‌పై ( Rajasthan govt ) ఆగ్రహంతో ఉన్నారని.. ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఇక ఈ ప్రభుత్వాన్ని కాపాడలేదని సతీష్ పునియా తెలిపారు.

ప్రస్తుత పరిస్థితిని అంతా నిశితంగా గమనిస్తున్నామని.. పరిస్థితి ఒక కొలిక్కి వస్తే.. తమ వ్యూహాలు ఏంటో వెల్లడిస్తామని సతీష్ పునియా అన్నారు. ( Also read: Rajasthan: పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి సచిన్ పైలట్ తొలగింపు )

 

Trending News