NTPC recruitment 2022: ఇండియన్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఉద్యోగ అవకాశాలు ప్రకటించింది. వివిధ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ట్రైనీలకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు పంపొచ్చని వివరించింది ఎన్టీపీసీ.
ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు? అనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
ఖాళీల వివరాలు ఇలా..
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ-ఫినాన్స్ (సీఏ/సీఎంఏ) 20 పోస్టులు
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫినాన్స్ (ఎంబీఏ ఫినాన్స్) 10 పోస్టులు
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హెచ్ఆర్- 30 పోస్టులు
శాలరీ ఎంత?
ఈ ఉద్యోగాలన్నింటికి రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు వేతనం ఉండనుంది (ఈ1 గ్రేడ్ క్యాటగిరీ వారికి).
అప్లయ్ చేయడం ఎలా?
- ముందుగా ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ (ntpc.co.in)లోకి లాగిన్ అవ్వాలి
- హోం పేజీలో కెరీర్ లింక్‌పై క్లిక్ చేయాలి
- అందులో ఏ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో.. దానిని సెలెక్ట్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారంలో అడిగిన వివరాలన్నీ సమర్పించి.. సబ్మిట్పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారంను పీడీఎఫ్‌ను సేవ్ చేసుకుని.. ప్రింటౌట్ కూడా తీసుకోవాలి. భవిష్యత్ అవసరాలకు అది అవసరమవుతుంది.
వయో పరిమితి ఎంత?
2021 మార్చి 21నాటికి 29 ఏళ్లు దాటి ఉండకూడదు. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితి మినహాయింపులకోసం ఎన్టీపీసీ వెబ్సైట్లో నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
Also read: Jayalalitha Death Mystery: అంత అస్వస్థతగా ఉంటే..ఎవరు నిర్లక్ష్యం చేశారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook