Asaduddin Owaisi on Hijab Row: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదంపై ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగా.. మరోవైపు రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ఈ వివాదం నిత్యం చర్చల్లో నానుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ హిజాబ్ వివాదాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు ఒక హిజాబీ భారత్‌కు ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఆరోజు దాకా నేను ఉండకపోవచ్చు.. కానీ నా వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోండి.. ఏదో ఒకరోజు హిజాబ్ ధరించిన యువతి ఈ దేశానికి ప్రధాని అవుతుంది. హిజాబ్ ధరించిన మహిళలు కాలేజీలకు వెళ్తారు... కలెక్టర్లు, డాక్టర్లు, మెజిస్ట్రేట్స్, వ్యాపారవేత్తలు అవుతారు. మన బిడ్డలు హిజాబ్ ధరించి బయటకు వెళ్తామని కోరితే.. తల్లిదండ్రులుగా వారిని సపోర్ట్ చేయండి. చూద్దాం... ఎవరు వారిని ఆపుతారో..!' అని అసదుద్దీన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను అసద్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
इंशा’अल्लाह pic.twitter.com/lqtDnReXBm
— Asaduddin Owaisi (@asadowaisi) February 12, 2022
హిజాబ్ వివాదంపై గతంలో స్పందించిన అసదుద్దీన్.. హిజాబ్ ధరించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. హిజాబ్ ధరించడం తన హక్కుగా పేర్కొంటూ 'అల్లా హో అక్బర్' అని నినదించిన విద్యార్థిని ముస్కాన్‌ని అసద్ అభినందించారు. హిజాబ్ కోసం జరిగే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అదే సమయంలో హిజాబ్ వివాదంపై పాక్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇది తమ ఇంటి సమస్య అని.. ఇందులో జోక్యం చేసుకునేందుకు పాకిస్తాన్ ఎవరని ప్రశ్నించారు. భారత్‌లో జరిగే విషయాలపై మాట్లాడే ముందు సొంత దేశంలోని సమస్యలపై దృష్టి సారించాలన్నారు.
కాగా, కర్ణాటకలోని పలు విద్యా సంస్థల్లో ముస్లిం యువతులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు కాషాయ కండువాలతో ఆందోళనలకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ విషయం కోర్టు దాకా వెళ్లడంతో విద్యా సంస్థల్లో మతపరమైన దుస్తులపై న్యాయస్థానం తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం వాటిని విచారణకు స్వీకరించలేదు.
Also Read: Aiden Markram SRH: రెండో రోజు 'తగ్గేదే లే' అన్న కావ్య పాప.. తొలి ఆటగాడినే పట్టేసిన సన్‌రైజర్స్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook