Probe on Pegasus: పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ నెల 28న విచారణ

Probe on Pegasus: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నిగ్గు తేలనుంది. అటు ప్రతిపక్షాలు, ఇటు మీడియా సంస్థలు పెగసస్ స్పైవేర్‌పై ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈనెల 28న విచారణ జరగనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 22, 2021, 09:59 AM IST
Probe on Pegasus: పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ నెల 28న విచారణ

Probe on Pegasus: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నిగ్గు తేలనుంది. అటు ప్రతిపక్షాలు, ఇటు మీడియా సంస్థలు పెగసస్ స్పైవేర్‌పై ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈనెల 28న విచారణ జరగనుంది.

మేకిన్ ఇజ్రాయిల్ సాఫ్ట్‌వేర్ పెగసస్ ఫోన్ ట్యాపింగ్(Pegasus phone tapping) వ్యవహారం దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది. ప్రముఖులందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని..దేశ భద్రతకు ముప్పు వాటిల్లిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి విచారించాలని డిమాండ్ చేశారు. అటు ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా సైతం ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సొంత పౌరుల ఫోన్లపై, కదలికలపై భారత ప్రభుత్వ సంస్థలు దృష్టి పెట్టినట్టు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. పాత్రికేయులపై నిఘా అంటే పత్రికా స్వేచ్ఛపై దాడి అని ఎడిటర్స్ గిల్ట్ (Editors Guilt) స్పష్టం చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు దారుణమని విమర్శించింది. పత్రికా స్వేచ్ఛను కాపాడకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాధించేదెలా అని ప్రశ్నించారు. 

ఇప్పుడీ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ఎంపీ శశి ధరూర్(Sasi Dharoor)నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం విచారణ జరపనుంది. ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వ (Central government) ఉన్నతాధికారుల్ని ప్రశ్నించే అవకాశాలున్నట్టు తెలిసింది. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీపై శశిథరూర్ నేతృత్వంలో 32 మంది సభ్యుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(Parliamentary Standing Committee)ఏర్పాటైంది. ట్యాపింగ్‌పై విచారణకు హాజరుకావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, హోంశాఖల ఉన్నతాధికారులకు స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. 

Also read: Pegasus spyware: నిఘా దేశంగా మార్చుతున్నారా ? కేంద్రంపై మమతా విమర్శలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News