PM Modi greets people across the nation on Bhogi and Makar Sankranti: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS)లో భోగి పండుగ (Bhogi) సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు.. భోగి మంటల దగ్గర పిల్లలు కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి భోగి మంటల వద్ద చిన్నారులు కోలాటలతో ఆదిపడుతున్నారు. మరోవైపు హరిదాసుల కీర్తనలతో తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ సినీ, రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు (Bhogi Wishesh) చెపుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రజలందరికీ ట్విట్టర్ వేదికగా భోగి శుభాకాంక్షలు తెలిపారు. 'అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనంద స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రధాని ట్వీటుకు తెలుగు ప్రజలు ధన్యవాదాలు తెలుపుతూ భోగి శుభాకాంక్షలు చెపుతున్నారు.
Also Read: Archana Gautam - Congress Ticket: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. మిస్ బికినీకి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్!!
Bhogi greetings to everyone. May this special festival enrich the spirit of happiness in our society. I pray for the good health and well-being of our fellow citizens. pic.twitter.com/plBUW3psnB
— Narendra Modi (@narendramodi) January 14, 2022
ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) భోగి పండగ శుభాకాంక్షలు చెప్పారు. 'మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు' అని సీఎం ట్వీట్ చేశారు. అలానే తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) కూడా ప్రజలందరికి భోగి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Video: మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్.. చిన్నపిల్లాడిలా వరుణ్‌తో గొడవపడ్డ చిరు...
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి