దేశంలో కరోనా వైరస్ ( Corona virus ) ఉగ్రరూపం దాలుస్తోంది. ఎన్ని చర్యలు ఎన్నెన్ని ఆంక్షలు విధిస్తున్నా వైరస్ సంక్రమణ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతిరోజూ వెలుగుచూస్తున్న గణాంకాలు భయపెడుతున్నాయి. ఈ నెలాఖరుకు భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఆ దేశాన్ని సైతం దాటేస్తుందా? మరి ప్రత్యామ్నాయమేంటి?
కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) సంక్రమణ ప్రమాదకర స్థాయిని దాటేస్తోంది. వైరస్ సంక్రమణను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనివ్వకపోవడానికి కారణమేంటి? ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏం జరుగుతుంది? ప్రత్యామ్నాయమేంటి ? ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య ( Corona cases in India ) 8 లక్షల 20 వేల 916కు చేరుకుంది. గత 24 గంటల్లోనే అత్యధికంగా 27 వేల 114కు చేరుకుంది. గత 24 గంటల్లో 519 మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందగా...ఇప్పటివరకూ దేశంలో 22 వేల 123 మంది మృత్యువాత పడ్డారు. దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో కోవిడ్ 19 రోగులు 2 లక్షల 83 వేల 407 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటివరకూ దేశంలో 5 లక్షల 15 వేల 386 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
ప్రస్తుతం భారతదేశం కరోనా వైరస్ సంక్రమణ విషయంలో ప్రపంచంలో మూడోస్థానంలో ఉంది. 32 లక్షల 91 వేల 786 కేసులతో ( America corona cases ) అమెరికా తొలి స్థానంలో ఉండగా...18 లక్షల 4 వేల 338 కేసులతో ( Brazil corona cases ) బ్రెజిల్ రెండోస్థానంలో ఉంది. భారత్ లో ప్రతిరోజూ కనీసం 25 వేల కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరుకు భారతదేశ కరోనా కేసులు బ్రెజిల్ ను దాటవచ్చనేది ఓ అంచనా. Also read: Sachin: ముంబాయిలో ప్లాస్మా థెరపీ యూనిట్ ప్రారంభం
దేశం ఇప్పటివరకూ 5 లాక్డౌన్ ( Lockdown ) లు చవిచూసింది. ప్రస్తుతం అన్లాక్ ( Unlock ) ప్రక్రియ కొనసాగుతోంది. మూడు నెలలుగా గాడి తప్పిన జీవితాన్ని, ఆర్ధిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించే పని సాగుతోంది. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్సింగ్ చాలావరకూ కనుమరుగైపోయింది. ఢిల్లీ, ముంబాయి వంటి నగరాల్లో కరోనా ముందున్నట్టే పరిస్థితి నెలకొంది. జీవితం ముఖ్యమా లేదా ఆర్ధిక పరిస్థితి ముఖ్యమా అనేదానికి సమాధానాలు వెతికే కంటే కరోనా సంక్రమణ నుంచి దూరంగా ఉండటం అవసరమనే వాస్తవాన్ని గ్రహించాల్సి ఉంటుంది. కరోనా సంక్రమణ వేగానికి కళ్లెం వేయడం పూర్తిగా ప్రజల చేతుల్లోనే ఉంది. ఎవరికివారు కోవిడ్ 19 వైరస్ గైడ్ లైన్స్ ను పాటిస్తే తప్ప పరిస్థితి మెరుగుపడే అవకాశాల్లేవు. ఐసీఎంఆర్ పదే పదే చెబుతున్నది ఇదే. వ్యాక్సిన్ వస్తే అంతా కంట్రోల్ అవుతుందని భావించడంలో తప్పు లేదు గానీ..స్వీయ నియంత్రణ అమలు చేయకపోతే పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( Masachusetts institute of india ) ( MIT ) ఇదే హెచ్చరించింది. Also read: Covid19 virus: మరో 8 నెలల్లో 25 కోట్ల కరోనా కేసులు