PM Modi: మోదీ సర్కారు పై ఆర్ఎస్ఎస్ ప్రశంసలు.. 58 ఏళ్ల నిషేధంపై కీలక నిర్ణయం..డిటెయిల్స్ ఇవే..

Rss Praises modi: పీఎం మోదీపై ఆర్ఎస్ఎస్ ప్రశంసలు కురిపించింది. గత 58 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో  ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదంటూ  కూడా నిషేధం విధించారు. ఈ క్రమంలో తాజగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 22, 2024, 04:28 PM IST
  • సంఘ్ పై ఆ నిషేధం ఎత్తివేసిన కేంద్రం..
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్ఎస్ఎస్ ..
PM Modi: మోదీ సర్కారు పై ఆర్ఎస్ఎస్ ప్రశంసలు.. 58 ఏళ్ల నిషేధంపై  కీలక నిర్ణయం..డిటెయిల్స్ ఇవే..

Rss praises pm modi government for lifting ban on government employees: దేశం పునర్నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర వహిస్తుందని  ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార ఇన్‌చార్జి సునీల్ అంబేకర్ అన్నారు. గత 99 సంవత్సరాలుగా దేశం కోసం, సమాజ సేవలో సంఘ్ సంస్థ నిరంతరం నిమగ్నమై ఉందని అన్నారు. అదే విధంగా హిందు ధర్మం కాపాడాటం కోసం సంఘ్ కంకణం కట్టుకుందన్నారు. ఈనేపథ్యంలో గతంలో సంఘ్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగ్యస్వామ్యంపై కొన్నేళ్లుగా నిషేధం ఉంది. దీనిపై అనేక సందర్బాలలో కూడా వివాదం ఉండేది.ఈ క్రమంలో ఇటీవల కేంద్ర  కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వరకు ఉన్న సంఘ్ లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని ఏదైతే నిషేధం గతంలో విధించారో దాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

Read more: Crocodile: ఇదేం పైత్యం.. 300 మొసళ్లు ఉన్న సరస్సులో బైక్ తో స్టంట్.. చివరకు ఊహించని ట్విస్ట్... వీడియో వైరల్..

దేశంలో దాదాపు.. 58 ఏళ్ల నుంచి కూడా సంఘ్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని నిషేధంను తాజాగా తొలగించారు. దీంతో సంఘ్ పరివార్ సభ్యులు మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాల పాటు కొనసాగిన నిషేధం ఎత్తివేయడం పట్ల సంఘ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతుంటారు. ఇప్పటికి కూడా అనేక మంది నేతల, రాజకీయ రంగాల ప్రముఖులు, కీలక స్థానాల్లో ఉన్నవారు..ఆర్ఎస్ఎస్ లో ఉన్నవారే అని తెలుస్తోంది.

ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ లో చాలా మంది చిన్న తనం నుంచి వెళ్తుంటారు. ముఖ్యంగా శాఖ అని ఉదయం, సాయత్రం పూట ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకకార్యక్రమాలు చేస్తుంటారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోదీ సర్కారు సంఘ్ లోపైన ఉన్న నిషేధం ఎత్తివేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోదీ 3.0 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక విధాలుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ  ఓడిపోవడం పట్ల కూడా ఆర్ఎస్ఎస్ కుండ బద్దలు కొట్టినట్లు బీజేపీ చేసిన తప్పిదాలను ఎత్తిచూపింది.

Read more: Puja Khedkar: మహానటి.. అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ..

గతంలో పలు సందర్భాలలో.. ఆర్ఎస్ఎస్, సంఘ్ దేశంలో అనేక నిర్మాణాత్మక ప్రక్రియను చేపట్టిందని చెప్తుంటారు. ఆర్ఎస్ఎస్ ను కొందరు కేవలం హిందువులకు  మాత్రమే సపోర్ట్ చేస్తుందని, కొందరు పలు సందర్భాలలో విమర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోదీ సంఘ్ పై నిషేధం ఎత్తివేయడం ను కొందరు స్వాగతీస్తుండగా.. అపోసిషన్ పార్టీలు మాత్రం విమర్శిస్తున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఒకటేనంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News