Scorpio Rams into Baraat: పెళ్లి ఊరేగింపు బృందాన్ని తొక్కుకుంటూ వెళ్లిన స్కార్పియో

Scorpio Rams into Baraat: స్కార్పియో వాహనం డ్రైవర్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్ పై అప్పటికే ఆగ్రహానికి గురైన పెళ్లి బృందం వారు.. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పెళ్లి బృందం వారు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2023, 12:04 AM IST
Scorpio Rams into Baraat: పెళ్లి ఊరేగింపు బృందాన్ని తొక్కుకుంటూ వెళ్లిన స్కార్పియో

Scorpio Rams into Baraat: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న వరుడి తరుపు బంధువలపైకి వేగంగా వచ్చిన ఓ స్కార్పియో వాహనం దూసుకుపోయింది. వాహనం హై స్పీడ్ మీద ఉండటంతో అదుపుతప్పి ఊరేగింపు బృందాన్ని ఢీకొని వారిపై నుంచి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో పెళ్లి బ్యాండ్ బృందానికి చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

హరిద్వార్ సమీపంలోని బెల్డా గ్రామం నుంచి వరుడి బృందం బహదరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని సర్దార్ ఫామ్ హౌజ్ కి చేరుకోగా.. అక్కడ వారికి స్వాగతం పలికే కార్యక్రమం జరుగుతున్న క్రమంలోనే ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం డ్రైవర్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్ పై అప్పటికే ఆగ్రహానికి గురైన పెళ్లి బృందం వారు.. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పెళ్లి బృందం వారు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. 

స్కార్పియ వాహనం డ్రైవర్‌పై మర్డర్ కేసుతో పాటు ర్యాష్ డ్రైవింగ్ నేరాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసు వివరాలు వెల్లడించిన హరిద్వార్ ఎస్పీ స్వతంత్ర కుమార్.. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పెళ్లి జరుగుతోందనే ఆనందంలో ఉన్న పెళ్లి వారింట ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇది కూడా చదవండి : Okaya Faast F3 EV Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్

ఇది కూడా చదవండి : Luxurious Trains: ఈ రైళ్లలో ప్రయాణిస్తే ఆ లగ్జరీనే వేరు.. మీరెప్పుడైనా ట్రై చేశారా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News