Supreme Court: నేర రహిత రాజకీయాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ నేతల గుండెల్లో గుబులు పట్టుకుంది.
దేశంలో నేర రహిత రాజకీయాల్ని స్థాపించే ఉద్దేశ్యంలో భాగంగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court) కీలకమైన ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. రాజకీయ పార్టీలు ఇకనుంచి అభ్యర్ధుల్ని ప్రకటించిన 48 గంటల్లోగా ఆయా అభ్యర్ధుల నేరచరితకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసుల్ని వివిధ రాష్ట్రాల హైకోర్టు అనుమతి లేకుండా విత్‌డ్రా చేయడానికి వీల్లేదని తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
గతంలో అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections) నమోదైన పిటీషన్ల విచారణ సందర్బంగా అంటే 2020 ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. గతంలో అభ్యర్ధులు నేర చరిత బహిర్గతపర్చాల్సిన గడువు గరిష్టంగా 2 వారాలుండగా..ఇప్పుడు 48 గంటలకు పరిమితం చేసింది సుప్రీంకోర్టు.నేర చరితను ప్రకటించని పార్టీల గుర్తుల్ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటించని పార్టీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవల్సిందిగా పిటీషన్ లో అభ్యర్ధించారు. నేర చరిత్ర ఉన్న అభ్యర్ధుల్ని ఎన్నుకోడానికి కారణాలు, నేరాల వివరాల్ని పార్టీ వెబ్సైట్లో ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలని పార్టీల్ని ఆదేశించింది.
Also read: ఈపీఎఫ్ సభ్యులకు కీలక సూచన, ఈ నామినేషన్ దాఖలు చేయకపోతే డబ్బులు పోయినట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook