న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాపించడానికి కారకుడయ్యాడనే నేరం కింద తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్ ఖండాల్విపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో పలు నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ ఎలాంటి భద్రత చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి మార్చి 13,14,15 తేదీలలో 1,300 మందితో మర్కజ్ నిర్వహించినందుకు ఐపిసి 304 సెక్షన్ ప్రకారం మౌలానా సాద్‌పై హత్య నేరం కింద కేసు నమోదు చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మౌలానా సాద్ నిర్వహించిన మర్కజ్కి హాజరైన వారిలో ఇప్పటికే చాలా మంది కరోనావైరస్ సోకి ప్రాణాలు కోల్పోగా.. వారి నుంచి ఇంకెంతో మందికి కోవిడ్ వ్యాధి సోకిందని ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Also read: Lockdown worries:భారతీయులను కరోనా కంటే ఎక్కువ వేధిస్తున్న అంశాలివే
ఇప్పటికే మౌలానా సాద్‌కు రెండు నోటీసులు పంపిన ఢిల్లీ పోలీసులు.. ఆ నోటీసుల ద్వారా అతడిని, అతడు నాయకుడిగా ఉన్న సంస్థపై ఎందుకు విచారణ జరపకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ 26 ప్రశ్నలు సంధించారు.
Also read: Doctor dies of COVID-19: కరోనాతో డాక్టర్ మృతి.. ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్
ప్రస్తుతం తబ్లిగీ జమాత్ అధినేత మౌలానా మహమ్మద్ సాద్ ఖండాల్వి క్వారంటైన్లో ఉన్నాడు. మౌలానా సాద్ క్వారంటైన్ పూర్తయిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సాద్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే అతడిని అరెస్ట్ చేయాలా వద్దా అనేది అతడి వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులే నిర్ణయిస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..