Tamilisai Soundararajan clarity over amitshah viral video: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు, తమిళి సై, వెంకయ్య నాయుడు వంటి తదితరులు హజరయ్యారు. అదే విధంగా సినిమా రంగంనుంచి రజనీ కాంత్, చిరంజీవీ, రామ్ చరణ్ లు హజరయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకరం దాదాపుగా ఎమోషనల్ కు గురిచేసేటువంటి అనేక ఘటనలు జరిగాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఆలింగనం చేసుకొవడం, చంద్రబాబు, చిరంజీవి ఎమోషనల్ అవ్వడం, బాలయ్య తన సోదరి భువనేశ్వరిని, ప్రేమతో ముద్దుపెట్టడం వంటి అనేక సంఘటనలు జరిగాయి.
Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
అయితే.. దీనికి క్వైట్ అపోసిట్ గా ఒక ఘటన జరిగిందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది తమిళి సై.. ప్రమాణ స్వీకారంలో అందరిని విష్ చేసుకుంటూ వేదికమీద వస్తున్నారు. ఇంతలో.. అమిత్ షా.. తమిళి సైని దగ్గరకు పిలిపించుకుని ఏదో కోపంగా మాట్లాడినట్లు ఆయన హవా భావాలు ఉన్నాయి. తమిళి సై.. ఏదో చెప్పబోతుంటే.. అమిత్ షా.. కాస్త కోపంగా అసహానంతో ఉన్నట్లు ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
దీనిపై రాజకీయాల్లో ఒక రేంజ్ లో దీనిపై దుమారం చెలరేగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తమిళి సై కి క్లాస్ పీకారని చాలా మంది ప్రచారం చేశారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికలలో బీజేపీ.. ఒక్కసీటు కూడా గెలవకపోవడం.. అన్నామలై, తమిళిసై లమధ్య ఆధిప్యత పోరు.. తోనే క్లాస్ పీకినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా తమిళి సై ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో, మీడియాలో.. అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని వస్తున్న వార్తలను తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై ఖండించారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తాను తొలిసారి హోమ్ మినిస్టర్ అమిత్ షా కలిసినట్లు చెప్పారు.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
అయితే ఎన్నికల తర్వాత పరిణామాల గురించి.. ఎన్నికల సందర్భంగా ఎదురైన సంఘటనల గురించి అడిగి తెలుసుకున్నారని తమిళిసై క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా తమిళనాడులో బీజేపీ పట్టు కోసం, కార్యకర్తలు, స్థానిక నేతలను కలుపుకుని వెళ్లి మరింతగా కష్టపడాలని షా చెప్పినట్లు ఆమె అన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకే ఈ ట్వీట్ చేస్తున్నట్లు తమిళిసై క్లారిటీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter