Telangana Lok Sabha Elections 2024 Latest Survey: తెలంగాణ లోక్‌సభలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న సంచలన సర్వే..

Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్‌ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా  గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్‌లోక్‌పాల్ సర్వే చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 11, 2024, 12:23 PM IST
Telangana Lok Sabha Elections 2024 Latest Survey: తెలంగాణ లోక్‌సభలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ?  ఆసక్తిరేకిస్తోన్న సంచలన సర్వే..

Telangana Lok Sabha Elections 2024  Latest Survey: 2024 భారత దేశంలో జరిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం దేశంలోని అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. దేశంలో ఏప్రిల్ 19 న తొలి విడత ఎన్నికలతో ఈ  క్రతువు మొదలైన .. జూన్ 1న జరిగే ఏడో విడత ఎన్నికలతో ముగుస్తాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్టు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.  తాజాగా ప్రముఖ సర్వే సంస్థ జన్‌లోక్ పాల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లపై సంచలన సర్వేను బయట పెట్టింది. ఈ సర్వేను మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 మధ్యలో 2 శాతం శాంపుల్ సైజులో  ఈ సర్వేను నిర్వహించినట్టు ఈ సంస్థ ప్రకటించింది.

ప్రస్తుతం బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానం మహబూబా బాద్ విషయానికొస్తే..
ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి  - 46.05 %
BRS - 30.25 %
BJP - 19.90 %
ఇతరులకు 3.80  % ఉన్నాయి. మొత్తంగా ఈ సర్వే ప్రకారం ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని ఈ శాంపుల్ ఒపినీయన్‌ పోల్‌లో పేర్కొన్నారు.

అటు ఉమ్మడి మహబూర్ నగర్ లో ఉన్న నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సీటు బీఆర్‌ఎస్ సిట్టింగ్..
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ - 40.05 %
BJP - 37.60 %
BRS - 18.20 %
ఇతరులు  - 4. 15 % శాతం ఉంది. మొత్తంగా ఈ సీటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇక్కడ సెకండ్ ప్లేస్‌లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ తరుపున మల్లు రవి, బీఆర్ఎస్ తరుపున ఆర్.ఎస్.ప్రవీణ్‌ కుమార్.. బీజేపీ తరుపున భరత్ పోటీలో ఉన్నారు.

ఖమ్మం లోక్‌సభ స్థానం విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సీటు కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం
ప్రస్తుతం ఇక్కడ ఇప్పటి కిపుడు ఎన్నికలు జరిగితే..
కాంగ్రెస్ పార్టీకి  - 54.23 %
BRS - 33.05 %
BJP - 2.80 %
ఇతరులు - 9.92 %  ఉంది.
మొత్తంగా ఖమ్మం సీటు కాంగ్రెస్ పార్టీ సగానికి పైగా ఓట్ షేర్‌తో ఈ సీటును కైవసం చేసుకునే అవకాశం ఉంది.  ఈ సీటును కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు.

భువనగిరి విషయానికొస్తే..

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం విషయానికొస్తే..
BJP - 34.90 %
కాంగ్రెస్ - 33.05 %
BRS - 26.12 %
ఇతరులు - 5.93 %  ఉంది.

ఇక్కడ బీజేపీ తరుపున బూర నర్సయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. అటు కాంగ్రెస్ తరుపున చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తంగా ఈ సీటు బీజేపీ, కాంగ్రెస్  పార్టీ మధ్య పోటా పోటీగా ఉంది.

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం విషయానికొస్తే..
కాంగ్రెస్ పార్టీ - 53.20 %
BRS - 28.85 %
BJP - 10.56 %
ఇతరులు -7.39 %   ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ సీటు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలిచే అవకాశాలున్నాయ.

వరంగల్..
కాంగ్రెస్ పార్టీ - 39 %
BJP - 27 %
BRS - 30 %
ఇతరులు - 7 %
ఉంది ఈ సీటు ఇప్పటి కిపుడు ఎన్నికలు జరిగితే కాంగ్రస్ పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలున్నాయి.

పెద్దపల్లి..
కాంగ్రెస్ పార్టీ 38 %
BRS - 32 %
BJP - 20 %
ఇతరులు - 7 % ఉంది.  మొత్తంగా పెద్దపల్లి సీటు కూడా ఇప్పటికిపుడు ఎన్నికలు జిరగితే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు గ్యారంటీగా గెలిచే అవకాశాలున్నాయి. అటు భువనగిరి, మల్కాజ్‌గిరిలో హోరాహోరీగా ఉంది. మొత్తంగా 6 సీట్లకన్నా ఎక్కువ లోక్‌సభ సీట్లను గెలుస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News