India Bypolls: తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఇవాళ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అటు అసెంబ్లీ, అటు లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల పోలింగ్ కొన్నిచోట్ల మందకొడిగా, ఇంకొన్నిచోట్ల వేగంగా సాగుతోంది.
ఇవాళ ఉపఎన్నికలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోని బద్వేలు, హుజూరాబాద్ అసెంబ్లీ(Huzurabad Bypoll) నియోజకవర్గాలకే కాదు..మొత్తం 13 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.13 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఉపఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఇవాళ. కొన్ని ప్రాంతాల్లో ఉదంయ 6 గంటల్నించే ఓటర్లు బారులు తీరారు. దేశవ్యాప్తంగా ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నిక ఇవాళ జరుగుతోంది. బద్వేలులో(Badvel Bypoll)పోలింగ్ కాస్త మందకొడిగా ఉన్నా..హుజూరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి హుజూరాబాద్ లో 66 శాతం పోలింగ్ నమోదు కాగా, బద్వేలులో 44 శాతం మాత్రమే నమోదైంది.
ఇక దేశవ్యాప్తంగా దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అసోంలో 5, బెంగాల్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 3, మేఘాలయలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, బీహార్ 2, కర్ణాటకలో 2, రాజస్థాన్‌లో 2, మహారాష్ట్ర, హర్యానా, మిజోరం, ఏపీ, తెలంగాణలో ఒక్కొక్క స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
Also read: National Media Awards 2021: జాతీయ మీడియా అవార్డుల ఎంట్రీలకు ఆహ్వానం, అర్హత వివరాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి