Tomato Price Rate High: గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. చాలా చోట్ల కిలో టమాటా రూ.100పైనే పలుకుతోంది. కొన్ని ప్రదేశాల్లో రూ.120లకు కూడా అమ్ముతున్నారు. దీంతో పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కొనుగోళ్లు తగ్గించారు. మహిళలు వంట వండాలంటే భయపడుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడం, రుతుపవనాలు ఆలస్యం కావడం, కొన్ని చోట్ల వరదలు పోటెత్తడం వల్ల టమాటా ధరలు పెరగడానికి కారణాలుగా భావిస్తారు.
టమోటా ధరలు పెరగడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూరగాయల దుకాణం వద్ద నిలబడి ఉన్న ఫోటోను వైరల్ చేసింది. ''టమోటా 100 రూపాయలు దాటింది. మోదీ గారూ ఇప్పటికైనా ప్రజలను కరుణించండి అంటూ'' కాంగ్రెస్ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. కూరగాయల ధరలు పెరగడంపై ప్రియాంక గాంధీ సైతం విమర్శలు గుప్పించారు.
मैं उस समाज से हूं जो अब #टमाटर भी नहीं खाती ! #टमाटर pic.twitter.com/q8i09d5oBg
— Kirti Azad (@KirtiAzaad) June 27, 2023
టమాటా ధర పెంపుపై సోషల్ మీడియాలో సామాన్యులు సైతం ప్రశ్నలు సంధించారు. గతంలో పెట్రోల్.. ఇప్పుడు వంటకాల్లో ఉపయోగించే టమాటా ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజలు వాపోతున్నారు. ఈ ధరలు ఎప్పటివరకు పెరుగుతాయోనని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఉల్లి ధర పెరగడం కూడా పెద్ద దుమారమే రేగింది.
प्रधानमंत्री जी ने कल भोपाल में महँगाई की लिस्ट पढ़ी। लेकिन वो लिस्ट भी पहले की लिस्टों की तरह किसी ने गलत बना दी।
मध्य प्रदेश में
पेट्रोल का दाम: 108 रू लीटर
टमाटर का दाम: 100 रू किलो
दाल का दाम: 150 रू किलो
रसोई का सिलेंडर: 1130 रू/ सिलेंडर है।जनता जो महँगाई की मार झेल रही…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 28, 2023
Also Read: Gratuity and Pension Rule: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక.. కీలక నిబంధనల్లో మార్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి