Agnipath Effect: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పథకాన్ని రద్దు చేసే వరకు నిరసన ప్రదర్శన కొనసాగుతుందని ఆర్మీ అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు. అగ్నిపథ్ ఆందోళనలతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇవాళ కూడా పలు రైళ్లు రద్దు అయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్‌లే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి.
ఈమేరకు రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని రైళ్లను దారి మల్లించారు. మరి కొన్ని రైళ్లను రద్దు చేశారు. విశాఖ పట్నం రైల్వే స్టేషన్ పరిధిలో కొన్ని రైళ్లు రద్దు అయ్యాయి. ఆ వివరాలను సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ప్రకటించారు.
రద్దు అయిన రైళ్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..
-షాలిమార్-సికింద్రాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్(18045)
-విశాఖ- గుంటూరు ఎక్స్‌ప్రెస్(17240)
-గుంటూరు- విశాఖ ఎక్స్‌ప్రెస్(17239)
-కాకినాడ- విశాఖ పట్నం (17267)
-విశాఖపట్నం- కాకినాడ(17268
-విశాఖపట్నం-రాయగడ ఎక్స్‌ప్రెస్(18528)
-రాయగడ-విశాఖపట్నం(18527)
19న రద్దు అయిన రైళ్ల వివరాలు..
-షాలిమార్-సికింద్రాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్(18045)
-గుంటూరు- విశాఖ ఎక్స్‌ప్రెస్(17239)
-రాయగడ-విశాఖపట్నం(18527)
Also read: Bandi Sanjay on Agnipath: సీఎంవో కుట్రతోనే సికింద్రాబాద్ అల్లర్లు..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!
Also read: Bandi Sanjay on Agnipath: సీఎంవో కుట్రతోనే సికింద్రాబాద్ అల్లర్లు..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Agnipath Effect: దేశంలో అగ్నిపథ్ ఎఫెక్ట్..పలు రైళ్ల రాకపోకలు రద్దు..ఆ వివరాలు ఇవిగో..!
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు
పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్
ఆందోళనలతో రైళ్ల రద్దు