UP Baghpat Incident: ఉత్తరప్రదేశ్‌లో బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు జైనుల ఏర్పాటు చేసిన లడ్డూ మహోత్సవ కార్యక్రమంలో వేదిక కూలి ఏడుమంది చనిపోయారు. ఈ ఘటనలో 70 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆరా తీశారు. జనం ఒక్కసారిగా వేదికపైకి రావడంతో వెదురు కర్రలతో నిర్మించిన వేదిక కుప్పకూలిపోయింది. దీంతో అక్కడికక్కడే ఏడుగురు చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఈ బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ప్లాన్‌తో మీ సిమ్ 10 నెలలు యాక్టీవ్.. ఉచిత కాలింగ్‌తోపాటు డేటా ఫ్రీ..
అయితే ఈ లడ్డు మహోత్సవం జైన్ కమ్యూనిటీకి చెందింది. దీన్ని గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. జైన్ కమ్యూనిటీకి చెందిన బరౌత్ ఈ లడ్డు మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. వారి ఆరాద్య దైవం అయిన ఆదినాధ నిర్వాణలో భాగంగా ఈ ఉదయం ఎక్కువ సంఖ్యలో లడ్డూలు సమర్పించడానికి జైన్ కమ్యూనిటీకి చెందిన వారు వందల కొద్దీ భక్తులు వచ్చారు. అయితే, ఆ సమయంలో వందల మంది భక్తులు ఆ స్టేజ్ పైకి చేరడంతో వేదిక కుప్పకూలిపోయింది అని ఓ భక్తుడు అన్నారు.
వెదురు కర్రలతో తయారు చేసిన వేదిక బరువు ఎక్కువ అవ్వడంతో కూలిపోయింది. అయితే ఈ ఉత్సవానికి వందల కొద్దీ జైన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చేరుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అంబులెన్స్ కూడా సకాలంలోనే వచ్చాయని బాగ్‌పత్ పోలీస్ చీఫ్ అర్పిత్ విజయవర్గీయ చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయిస్తున్నామన్నారు. కొంతమందికి గాయాలయ్యాయి ఫస్ట్ ఎయిడ్ చేయించి వారిని ఇంటికి పంపించామని చెప్పారు. చనిపోయిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. అధికారులను వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అన్నారు.
ఇదీ చదవండి: స్ట్రాబెర్రీ ఈ రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు, రోజూ తింటారు..
यूपी के बागपत में आयोजित निर्वाण धार्मिक महोत्सव में सरकारी प्रशासनिक अनदेखी व लापरवाही के कारण भीड़ नियंत्रण की कोई मॉनिटरिंग ना होने के कारण हादसा हुआ और सैकड़ो श्रद्धालुओं के घायल होने की सूचना है एवं कुछ के हताहत होने की अपुष्ट सूचना है ,ईश्वर से प्रार्थना है सभी लोग सकुशल… pic.twitter.com/5ufucJq4zG
— SamajwadiPartyMediaCell (@MediaCellSP) January 28, 2025
సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఎక్స్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు. యూపీలో జరిగిన ఈ భాగపత్ ఘటన పరిపాలన నిర్లక్ష్యం వల్లే జరిగింది. రద్దీ నియంత్రణపై పర్యవేక్షించలేదు, కొంత మంది చనిపోయారు. వందలాది భక్తులు గాయాలైనట్లు నివేదికలు వచ్చాయి వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. యోగి ప్రభుత్వం మతం పేరుతో పెద్ద డ్రామా చేస్తోంది ప్రజలకు సౌకర్యాలు భద్రత కల్పించడం లేదు. ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి మతపరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
తిరుమల..
జనవరి 8వ తేదీ తిరుపతి వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 35 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కోసం గేటు తెరవగానే ఒక్కసారిగా దాదాపు రెండువేలకు పైగా భక్తులు తోసుకొని రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.