Man booked for 'Pak Zindabad' Song: 'పాకిస్తాన్ జిందాబాద్' అనే పాట ప్లే చేసినందుకు ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కిరాణ షాపు నడుపుకునే ఓ వ్యక్తి... తన షాపులో ఈ పాటను ప్లే చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్త బీజేపీ నేతల దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ షాపుకు చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బరేలీ ఎస్పీ రాజ్‌కుమార్ ఈ ఘటనపై మాట్లాడుతూ... భూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షాపులో 'పాకిస్తాన్ జిందాబాద్' అనే పాటను ప్లే చేశారని చెప్పారు. బీజేపీ నేతల ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదైందని... వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, నిందితుడి తల్లి ఈ ఘటనపై మాట్లాడుతూ.. అసలేం జరిగిందో తమకు తెలియదన్నారు. 'అక్కడ సరిగ్గా ఏం జరిగిందో మాకు తెలియదు. మా చిన్న కొడుకు తన మొబైల్‌లో కొన్ని మతపరమైన సాంగ్స్ ప్లే చేశాడు. అయితే అందులో ఇలాంటి స్లోగన్స్ ఉన్నాయనే విషయం అతనికి తెలియదు. మేమెప్పుడూ అలాంటి పాటలు పెట్టలేదు. నా కొడుకు చదువులేని వ్యక్తి. దయచేసి అతన్ని విడిచిపెట్టాలని పోలీసులను అభ్యర్థిస్తున్నా.' అని వాపోయారు.
గతంలో నోయిడాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మతపరమైన ఊరేగింపులో ముగ్గురు వ్యక్తులు 'పాకిస్తాన్ జిందాబాద్' అనే నినాదాలిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
रमज़ान का पवित्र महीना चल रहा है और बरेली में मुस्तकीम व नहीम पाकिस्तान ज़िंदाबाद के गाने बजाये जा रहे हैं !
इस देश में रह रहे हो..इस देश का खा रहे हो ..पी रहे हो..संशाधनों का उपयोग कर रहे हो और फिर भी पाकिस्तान ज़िंदाबादतुम्हारे जैसे ग़द्दार और नमकहराम पूरी दुनियाँ में नहीं👎 pic.twitter.com/KUTvLsvThG
— Major Surendra Poonia (@MajorPoonia) April 15, 2022
Also Read: Suicide in Metro Station: ఢిల్లీ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన ఆ యువతి మృతి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook