అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అత్యధికంగా విజృంభిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. అయితే మెహసనాలో ఆరు రోజుల కవలలకు కరోనా నిర్ధారణ కాగా ఓ గర్భిణికి ఇటీవల కరోనా సోకింది. ఆమె ఈ నెల 16న వాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో మగ బిడ్డ, ఆడబిడ్డ జన్మించింనందుకు కుటుంబ సభ్యులు సంతోషించారు. కానీ ఆరు రోజులకే తల్లికి సోకిన కరోనా వైరస్ ఈ పసికందులకు కూడా సోకిందని తెలిసి వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటివరకు గుజరాత్లో వైరస్ సోకిన అతిపిన్న వయస్కులు ఈ కవలలేనని వైద్యులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ కవలల ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
Also Read: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇప్పుడది చాలా సులభం..
మరోవైపు గుజరాత్ కు సమీపంలో ఉన్న కాడిలా ఫార్మాస్యూటికల్స్ ధోల్కా ప్లాంట్లోని ముగ్గురు ఉద్యోగులు కరోనావైరస్ ఇన్ఫెక్షన్తో మరణించినట్లు శుక్రవారం నాడు కంపెనీ తెలిపింది. మృతులు కంపెనీ ఉత్పత్తి, ప్యాకేజింగ్ విభాగాలలో పనిచేస్తుండేవారని ఓ ప్రతినిధి తెలిపారు. కాగా ఈ నెల ప్రారంభంలో ధోల్కాలోని ఫార్మా సంస్థ తయారీ విభాగంలో 26 మంది ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. COVID-19 కారణంగా మరణించిన ముగ్గురు ఉద్యోగులను కోల్పోయినందుకు కంపెనీ యాజమాన్యం తమ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..