Maharashtra cm Devendra fadnavis attended zee real heroes awards: జీ రియల్ హీరోస్ అవార్డ్స్ కార్యక్రమం ముంబైలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మహా రాష్ట్ర ముఖ్య మంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ హజరయ్యారు. ఈ నేపథ్యంలో.. బాలీవుడ్ ఫెమస్ గాయకుడు కుమార్ సానూ సంగీత రంగంలో విశేషంగా సేవలు అందించారు. తన పాటల ద్వారా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన సంగీతంలో చేసిన అపార సేవలకు గాను.. జీ రియల్ హీరోస్ అవార్డ్స్ 2024 కు గాను.. లైఫ్ టైమ్ అవార్డును అందుకున్నారు.
🔸CM Devendra Fadnavis arrives at 'Zee Real Heroes' Program
🔸मुख्यमंत्री देवेंद्र फडणवीस यांचे 'झी रिअल हीरोज' कार्यक्रमात आगमन
🔸मुख्यमंत्री देवेंद्र फडणवीस इनका 'झी रियल हीरोज' कार्यक्रम में आगमन🕕 6.10pm | 14-1-2025📍Mumbai | संध्या. ६.१० वा. | १४-१-२०२५📍मुंबई.… pic.twitter.com/A6olgu3EbI
— CMO Maharashtra (@CMOMaharashtra) January 14, 2025
కుమార్ సాను.. ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా జీవిత కాల సాఫల్యత పురస్కారంను అందుకున్నారు. అదే విధంగా..ఈ కార్యక్రమంలో అజయ్ దేవ్ గన్, అనుపమ్ ఖేర్, పంకజ్ త్రిపాఠి, అమోఘ్ లీలా దాస్, కార్తిక్ ఆర్యన్, వంటి ప్రముఖులు జీ రియల్ హీరోస్ అవార్డ్స్ అందుకున్నవారిలో ఉన్నారు. వీరంతా సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా జీ రియల్ హీరోస్ అవార్డులు అందుకున్నారు. జీ రియల్ హీరోస్ కార్యక్రమంలో గ్రాండ్ గా జరిగింది. ముఖ్యంగా వివిధ రంగాలలో చేసిన సేవలను గుర్తించి.. జీ మీడియా రియల్ హీరోస్ అవార్డులతో సత్కరించింది.
అయితే.. జీ రియల్ హీరోస్ అవార్డ్స్ 2024 కు గాను సంగీత ప్రపంచంలో కుమార్ సానూ విశేషమైన సేవలు చేసినట్లు జీ రియల్ హీరోస్ అవార్డ్స్ టీమ్ గుర్తించింది. దీంతో ఆయన చేసిన సేవలకు గాను.. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ తో సత్కరిచింది. అయితే.. కుమార్ సానును.. బాలీవుడ్ లో.. "కింగ్ ఆఫ్ మెలోడీ" అని పిలుస్తుంటారు. ఆయన 2009లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
Read more: Harsha Richhariya: కుంభమేళలో సందడి చేస్తున్న గ్లామరస్ సాధ్వీ.. హర్ష రిచారియా ఎవరో తెలుసా..?
ఒకే రోజులో అత్యధిక పాటల్ని రికార్డు చేసి గిన్నిస్ రికార్డు సైతం సొంతం చేసుకున్నారు. "ఏక్ లడ్కీ కో దేఖా," "చురా కే దిల్ మేరా".. "తుజే దేఖా తో, "బాజీగర్ ఓ బాజీగర్ తో పాటు అనేక హిట్ పాటలతో అదరగొట్టారు.
హింది, మరాఠి, గుజరాతీ, తెలుగు, మలయాళంలో పాటు.. 30 కి పైగా భాషలలో తన ప్రతిభను కనబర్చారు. ఈ కార్యక్రమం అనంతరం మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ తన ఎక్స్ వేదికగా కార్యక్రమంకు సంబంధించిన అవార్డుల ప్రదానోత్సం ఫోటోలనుఅభిమానులతో పంచుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter