Viral Video: బురద అంటిన తన కాళ్లను కార్యకర్తతో కడిగించుకోవడం మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కార్యకర్తతో కాళ్లు కడిగించుకోవడం వివాదాస్పదమైంది. ఈ సంఘటనపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య యుద్ధమే జరిగింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే కార్యకర్తతో కాళ్లు కడిగించుకుంటున్న వీడియోను బీజేపీ నాయకుడు శాంతి కుమార్ విడుదల చేశాడు. నానా పటోలే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తత్వం 'రాజరికం' అని విమర్శించారు.
Also Read: Rahul Gandhi: వయనాడ్ వదులుకుని.. అమ్మ సీటే ఉంచుకున్న రాహుల్ గాంధీ
'నానా పటోలే పార్టీ కార్యకర్తతో కాళ్లు శుభ్రం చేయించుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులు ఓటర్లు, కార్యకర్తలను బానిసల్లాగా చూస్తుంటారు. తమను తాము రాజులు అనుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలా చేస్తుంటే అధికారంలోకి వస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి' అని శాంతి కుమార్ ఆ వీడియో పంచుకుంటూ పోస్టుచేశారు. నానా పటోలే కార్యకర్తకు క్షమాపణ చెప్పాలని మరో బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా, ఆ పార్టీ అమిత్ మాలవియా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిత్యం కార్యకర్తలను తీవ్రంగా అవమానిస్తోందని బీజేపీ ముంబై సోషల్ మీడియా గ్రూపు పోస్టు చేసింది.
Also Read: Electricity Bill: మీరు కరెంట్ బిల్లులు కట్టరా? మంత్రులు, ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఆగ్రహం
సర్వత్రా విమర్శలు వస్తుండడంతో నానా పటోలే స్పందించారు. 'వాడెగావ్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాను. అకోలాలో గజనాన్ మహారాజ్ ఆశీర్వాదం పొందాను. అయితే అక్కడ బురద ఉంది. నా కాళ్లకు బురద అంటుకుంటే నీళ్లు తీసుకురావాలని ఓ కార్యకర్తకు చెప్పా. అతడు నీళ్లు పోస్తుంటే కాళ్లు కడుక్కున్నా అంతే. దీనిలో వివాదం ఏముంది' అని ప్రశ్నించారు. తనపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు. 'నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. బురదలో తిరగడం నాకు కొత్త కాదు. ఇలాంటి ఆరోపణలతో బాధపడడం లేదు. మీలో (బీజేపీ) కొందరు నాయకులు పార్టీ కార్యకర్తలతో తల, కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్నారు. వాటి వీడియోలు ఎందుకు చూపించడం లేదు' అని ప్రశ్నించారు. 'ఏది ఏమైనా వీడియోతో తనకు ప్రచారం కల్పించిన మీకు కృతజ్ఞతలు' అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అక్కడ నల్లా కోసం వెతికితే ఎక్కడా నల్లాలు లేవని చెబుతూ బీజేపీ చెబుతున్న 'ప్రతి ఇంటికి నల్లా పథకం' అమలు కావడం లేదని పరోక్షంగా దెప్పి పొడిచారు.
In a shocking video, a Congress worker is seen washing Maharashtra Congress chief Nana Patole’s feet. It is the same party that went around lying to the Dalits that if BJP comes to power they will change the Constitution and remove reservation. And now this… How is this… pic.twitter.com/Fg1YvsvYzD
— Amit Malviya (@amitmalviya) June 18, 2024
विचार करा की आजच्या या सोशल मीडियाच्या युगात हे लोक एवढं खोटं बोलत आहेत तर या लोकांनी जुन्या काळात काय काय कारनामे केले असतील? @NANA_PATOLE जी, तुमचं खोटं उघडं पडलंय. pic.twitter.com/QmICtLz0L7
— Vibha Kurundkar (@vibha3011) June 18, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter