IMD Issued Red Alert: వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లాలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం-దక్షిణ ఒడిస్సా తీరంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో గురువారం ఉదయం వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిస్సా తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంగి ఉంది. ఇది రానున్న 2 రోజుల్లో ఒడిశా మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గుజరాత్, మహారాష్ట్రల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే మధ్యప్రదేశ్, ఒడిశా సహా మరో 6 రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ముంబయి, రాయ్‌గఢ్, రత్నగిరి, పూణే జిల్లాలతో పాటు వచ్చే మూడు రోజుల్లో ఆరెంజ్ అలర్ట్‌లో ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేటి నుంచి జూలై 24వ తేదీ వరకు తెలంగాణ, కర్ణాటకల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్‌లోని అజ్మీర్, జైపూర్, కోటా, ఉదీపూర్ జిల్లాల్లో భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయగా.. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోని జోధ్‌పూర్, జైసల్మేర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. "రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం, శుక్రవారం సెలవులు ఉంటాయి.." అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
Also Read: Manipur Violence: మణిపూర్‌లో భయంకరమైన వీడియో.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. దారుణం..!
Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook