Mamata Banerjee: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై విచారణకు ఆదేశించిన మమతా బెనర్జీ

Mamata Banerjee: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2021, 03:29 PM IST
Mamata Banerjee: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై విచారణకు ఆదేశించిన మమతా బెనర్జీ

Mamata Banerjee: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. 

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పెగసస్ స్పైవేర్(Pegasus Spyware)ఇంకా వివాదం రేపుతూనే ఉంది. పెగసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. హ్యాకింగ్ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తూ..ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మదన్ లోకో నేతృత్వంలో ద్విసభ్య కమిటీ ఏర్పాటైంది. కోల్‌కత్తా హైకోర్టు రిటైర్డ్ జడ్ది జ్యోతిర్మయి భట్టాచార్య, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకో ప్యానెల్ నాలుగు వారాల్లో నివేదిక సమర్పించనుంది. 

ప్రతిపక్ష నేతలు, రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హక్కుల సంఘ నేతలు తదితరుల ఫోన్‌లు హ్యాకింగ్‌కు గురయ్యారనే ఆరోపణలపై ఇదే తొలి అధికారిక విచారణ కమిటీ కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం(Central governent) ఈ వ్యవహారంపై విచారణ కమీషన్ ఏర్పాటు చేయకపోవడంతో తామే విచారణ కమీషన్ ఏర్పాటు చేసినట్టు మమతా బెనర్జీ(Mamata Banerjee) తెలిపారు. హ్యాకింగ్ వ్యవహారం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఇప్పటికే మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

Also read: Mamata Banerjee Delhi Tour: మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన లక్ష్యం అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News