Maternity Leave Rules: పెళ్లి కాకుండా మేటర్నిటీ సెలవులు ఇస్తారా, రూల్స్ ఏం చెబుతున్నాయి

Maternity Leave Rules: ప్రస్తుతం పురుషులతో సమానంగా చాలా చోట్ల మహిళా ఉద్యోగులు దర్శనమిస్తున్నారు. అదే సమయంలో మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కులు కూడా ఉన్నాయి. పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2024, 08:18 PM IST
Maternity Leave Rules: పెళ్లి కాకుండా మేటర్నిటీ సెలవులు ఇస్తారా, రూల్స్ ఏం చెబుతున్నాయి

Maternity Leave Rules: మఖ్యంగా సెలవుల విషయంలో మహిళలకు కొన్ని విషయాల్లో మ్యాండేటరీ ఉంటుంది. మెటర్నిటీ లీవ్ అనేది మహిళా ఉద్యోగులకు ఓ హక్కు. ప్రత్యేక పరిస్థితుల్లో ఏ మహిళ అయినా ఆ సెలవుల్ని పొందవచ్చు. అంటే గర్భిణీగా ఉన్న మహిళలు ఎవరైనా సరే మెటర్నిటీ సెలవులకు అర్హులే. 

అయితే మెటర్నిటీ సెలవుల విషయంలో చాలా సందేహాలు ఉత్పన్నమౌతున్నాయి. పెళ్లయిన గర్భిణీ మహిళలకే ఈ సెలవులు వర్తిస్తాయా అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పెళ్లి కాని మహిళా ఉద్యోగినులు సైతం గర్భం దాలుస్తుంటారు. మరి అలాంటివారికి మెటర్నిటీ సెలవులు ఉంటాయా లేదా, రూల్స్ ఏం చెబుతున్నాయనేది తెలుసుకోవడం చాలా అవసరం. వాస్తవానికి ప్రభుత్వరంగమైనా, ప్రైవేట్ రంగమైనా మెటర్నిటీ సెలవుల విషయంలో రూల్ ఒకటే. ఇదే ఇందులో ఉన్న గొప్ప విషయం. సెలవు పొందే విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగికి సమాన అవకాశాలుంటాయి. అయితే ఈ నిబంధన అంటే మెటర్నిటీ లీవ్ రూల్ అనేది 10 మంది కంటే ఎక్కువమంది ఉద్యోగులుండే ఆఫీసులు లేదా సంస్థలకే వర్తిస్తుంది. ఒకవేళ ఉద్యోగుల సంఖ్య 10 కంటే తక్కువ ఉంటే..మెటర్నిటీ లీవ్ రూల్స్ వర్తిచవు.

మెటర్నిటీ లీవ్ ఎప్పుడిస్తారు

మెటర్నిటీ బెనెఫిట్స్ బిల్ 2017లో కీలకమైన మార్పులు చేసింది కార్మిక శాఖ. గర్భిణీ మహిళలకు 26 వారాలు అంటే 6 నెలలు సెలవులు ఇవ్వబడతాయి. ఇంతకుముందు 12 వారాలు లేదా 3 నెలలు ఉండేది. తల్లీ బిడ్డ ఇద్దరి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెటర్నిటీ లీవ్ కేటాయిస్తారు. అంటే డెలివరీ తరువాత కూడా కొన్ని రోజులు ఇద్దరూ సురక్షితంగా ఉండేలా చట్టం రూపకల్పన జరిగింది. ఇందులో అతి గొప్ప విషయం ఏంటంటే మెటర్నిటీ లీవ్ సమయంలో మహిళలకు కంపెనీ పూర్తి జీతం చెల్లించాల్సి ఉంటుంది. ఏ విధమైన కోతలు చేయకూడదు.

మెటర్నిటీ లీవ్ షరతులు

మహిళా ఉద్యోగి 12 నెలల డెలివరీ సమయంలో 80 రోజులు తప్పనిసరిగా పనిచేసి ఉండాలి. అప్పుడే మెటర్నిటీ లీవ్ లభిస్తుంది. బిడ్డను దత్తత తీసుకున్న మహిళకు సైతం మెటర్నిటీ లీవ్ వర్తిస్తుంది. సరోగసీ కింద గర్భం దాల్చిన మహిళకు కూడా మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా మెటర్నిటీ లీవ్ వర్తిస్తుంది. పుట్టిన బిడ్డను ఆ బిడ్డ అసలు తల్లిదండ్రులకు అప్పగించేంతవరకూ 26 వారాల సెలవు ఇస్తారు. 

కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ రూపకల్పన చేసిన మెటర్నిటీ లీవ్ ప్రకారం పెళ్లయిన, పెళ్లి కాని మహిళలకు సమానంగా వర్తిస్తుంది. ఆ మహిళకు పెళ్లయిందా లేదా అనేది చట్టం చూడదు. గర్భం దాల్చిందా లేదా అనేదే చూస్తారు. ఎందుకంటే ఈ చట్టం రూపకల్పన చేసింది గర్బధారణకు లేదా బిడ్డ సంరక్షణ కోసమే. అందుకే పెళ్లి కాని అమ్మాయిలైనా గర్భం దాలిస్తే మెటర్నిటీ సెలవు ఇవ్వాల్సిందే.

Also read: Bank Holidays March 2024: మార్చ్ నెలలో 18 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News