Benefits Of Raisins Water: అందంగా కనిపించడానికి చాలా మంది ముఖానికి వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ముఖ సౌందర్యానికి పలు రకాల చిట్కాలను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం ఇంట్లో తయారు చేసిన ఫేస్ మాస్క్‌లను వినియోగించడం వల్ల ముఖం కాంతి వంతంగా మారడమేకాకుండా అన్ని రకాల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మాస్క్‌లను వాడడం వల్ల శీతాకాలంలో కూడా మూఖాన్ని గ్లో చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం ఎండుద్రాక్ష తయారు చేసిన పలు మాస్క్‌లను యూజ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.
ఫేస్ ప్యాక్‌ను ఇలా ఉపయోగించండి:
ఎండుద్రాక్ష నీటిని ఫేస్ ప్యాక్‌గా కూడా వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ముఖంపై గ్లో పెంచడమేకాకుండా చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా ఎండుద్రాక్ష నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని తేనెలో కలిపి, అందులో నానబెట్టిన ఎండు ద్రాక్షను కూడా వేయాలి. ఇలా వేసి అన్నింటి పేస్ట్‌లా చేయాలి. ఇలా చేని మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 20 నుంచి 25 నిమిషాల పాటు ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం మెరుస్తుంది.
అంతేకాకుండా ఈ నీటిని రోజ్ వాటర్‌లో కలిపి మూఖానికి కలిపి... అందులో మూడు చుక్కల నిమ్మరసాన్ని కలిపి మూఖానికి పట్టిస్తే ముఖంపై అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అన్ని రకాల వ్యాధుల నుంచి ముఖాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా ముఖంపై చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఫేస్‌పై ఈ వాటర్‌ను అప్లై చేయాలి.
రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది:
రోగనిరోధక శక్తితో బాధపడుతున్నవారికి ఎండుద్రాక్ష నీరు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా శరీరంలో ప్రమాదకరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అంతేకాకుండా కాలేయ వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ వాటర్‌ను తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook