Best Minerals For Health: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. అయితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి తప్పకుండా ఆహారాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక ఖనిజాలు ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైనది ఖనిజం జింక్.. పోస్ట్ కోవిడ్ కరణంగా చాలా మంది జింక్ సమస్యలతో బాధపడుతున్నారు. శరీరం దృఢంగా ఉండడానికి ఐరన్, మెగ్నీషియం చాలా ముఖ్యం. కాబట్టి ఇవి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. లేదంటే.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి విటమిటన్స్, మినరల్స్ కోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన ఖనిజాలు ఇవే:
జింక్:
జింక్ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కొత్త కణాలను తయారు చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జింక్ జుట్టు, చర్మానికి కూడా అవసరమవుతుంది.
జింక్ మూలాలు:
జింక్ అధిక పరిమాణంలో కాల్చిన బీన్, పాలు, జున్ను, పెరుగు, ఎర్ర మాంసం, శనగలు, కాయధాన్యాలు, గుమ్మడికాయ, నువ్వులు, వేరుశెనగ, జీడిపప్పు, బాదం, గుడ్డు, గోధుమలు, బియ్యం ఆహారాల్లో లభింస్తుంది. శరీరంలో జింక్ లోపాన్ని ఈ ఆహారాలతో తీర్చుకోవచ్చు.
ఐరన్:
శరీరంలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక వేళా శరీరంలో కోరత ఉంటే..రక్తహీనత, హిమోగ్లోబిన్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను తగ్గించి.. రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుంది.
ఐరన్ మూలాలు:
ఐరన్ కోరత తొలగిపోవడానికి.. ఆహారంలో బచ్చలికూర, బీట్‌రూట్, దానిమ్మ, ఆపిల్, పిస్తా, ఉసిరి, డ్రై ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్‌ని తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
మెగ్నీషియం:
రక్తపోటును నియంత్రించడానికి మెగ్నీషియం చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకలను దృఢంగా చేసేందుకు.. రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మెగ్నీషియం శరీరానికి అవసరమవుతుంది.
మెగ్నీషియం మూలాలు:
మెగ్నీషియం లోపాన్ని తగ్గించుకోవడానికి వేరుశెనగ, సోయా పాలు, జీడిపప్పు, బాదం, బచ్చలికూర, బ్రౌన్ రైస్, సాల్మన్ ఫిష్, చికెన్ వంటి ఆహారాలను తీసుకోవాలి.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook