Dal Ki Khichdi Recipe: ఆంధ్ర స్టైల్ దాల్ కిచిడి అంటే ఇష్టపడని వారు ఉండరు.. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దాల్ కిచిడి ఎక్కువగా తింటుంటారు. ఈ కిచిడిని అన్ని రకాల పప్పులతో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది దీనిని పెసరపప్పుతో తయారు చేసుకుంటూ ఉంటారు. పెసరపప్పులో ప్రోటీన్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి దాల్ కిచిడిని రోజు తినడం వల్ల ప్రోటీన్ లోపం మంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా కండరాల పరిమాణాలు కూడా పెరుగుతాయి. దీంతోపాటు ఎముకల సమస్యలు కూడా రాకుండా ఉంటాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా దాల్ కిచిడి ఆహారంలో చేర్చుకుంటే పోషకాలలోపం అస్సలే ఉండదట. చాలామంది ఈ రెసిపీని తయారు చేసుకునే క్రమంలో అనేక పొరపాట్లు పడుతున్నారు. దీనివల్ల సరైన టెస్ట్ పొందలేకపోతున్నారు. అయితే సులభమైన పద్ధతిలో ఈ దాల్ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో? కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు:
❊ బియ్యం
❊ పెసరపప్పు
❊ నీరు
❊ ఉప్పు
❊ నూనె
❊ జీలకర్ర
❊ కరివేపాకు
❊ ఉల్లిపాయ (మీకు అవసరమైనన్ని)
❊ అల్లం-వెల్లుల్లి పేస్ట్ (కావలసినంత)
❊ టమోటా (కావలసినన్ని)
❊ మిరియాల పొడి (కావలసినంత)
❊ ధనియాల పొడి (రావలసినంత)
❊ గరం మసాలా (కావలసినంత)
❊ నెయ్యి (కావలసినంత)
❊ కొత్తిమీర (గార్నిష్ కోసం)
తయారీ విధానం:
❊ ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా పెసరపప్పు బియ్యాన్ని కడిగి దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత మరోసారి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి.
❊ ఆ తర్వాత ఒక పాత్రలో నూనె వేసి.. అందులోనే జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు బచ్చే అంతవరకు, వాసన పోయేంతవరకు బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికొద్ది సేపు వేపుకోండి.
❊ ఇలా అన్ని వేపుకున్న తర్వాత మెత్తగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసి ఉడికించి.. పది నిమిషాల తర్వాత మిరియాల పొడి, ధనియాల పొడి, కావలసినంత గరం మసాలా వేసుకుని బాగా వేపుకోవాల్సి ఉంటుంది.
❊ అన్ని బాగా వేపుకున్న తర్వాత అందులోనే బియ్యం, పప్పు, ఉప్పు వేసి తగినంత నీటిని పోసుకొని రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంతవరకు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర చల్లుకొని పైనుంచి నెయ్యి వేసుకొని పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. అంతే దాల్ కిచిడి రెడీ అయినట్లే..
కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు:
❊ ఈ దాల్ కిచిడీలో కావాలనుకుంటే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. చాలామంది ఇందులో క్యారెట్‌తో పాటు బీన్స్ కూడా వేసుకుంటూ ఉంటారు.
❊ దాల్ కిచిడి ఎక్కువగా మృదువుగా రావాలంటే తప్పకుండా అందులో నీటిని ఎక్కువగా వేసుకోవలసి ఉంటుంది. కావాలనుకుంటే నెయ్యిని కూడా ఎక్కువగా వినియోగించవచ్చు.
❊ ఈ దాల్ కిచిడీని రిఫ్రిజిరేటర్ లో పెట్టి దాదాపు రెండు నుంచి మూడు రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter