Long & Shiny Hair Pack:ఈ కాలంలో జుట్టు విపరీతంగా ఊడిపోవడం అందరూ చెబుతుంటారు. దీనికి అనారోగ్య సమస్యలు, సరైన జీవనశైలి పాటించకపోవడం, పోషకాల లేమి కారణం కావచ్చు. అయితే, కొన్ని హోం రెమిడీలతో కూడా జుట్టు ఊడే సమస్యకు చెక్ పెట్టొచ్చు. వేలల్లో పార్లర్లకు ఖర్చు చేయకుండా ఇంటి హోం రెమిడీలతో తక్కువ ఖర్చుతో చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం.పుదీనా మన వంటింట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. పుదీనా పంటి, కంటి, కడుపు నొప్పి సమస్యలకు మంచి రెమిడీ. ఇది చల్లదనాన్ని ఇస్తుంది. పుదీనాను మనం సాధారణంగా వంటల్లో వాడతాం. కానీ, పుదీనాతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు. పుదీనాను జుట్టుకు హెయిర్ ప్యాక్ మాదిరి వేసుకోవడం వల్ల జుట్టు ఊడే సమస్యకు చెక్ పెడుతుంది. జుట్టు సిల్కీగా ఒత్తుగా పెరుగుతుంది.
పుదీనా హెయిర్ ప్యాక్ తో జుట్టు గరుకుదనం తగ్గుతుంది. పుదీనాలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందుకే ఇది జుట్టు సమస్యలను నయం చేస్తుంది. మనం పుదీనాతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం ఎలా తెలుసుకుందాం.
ఇదీ చదవండి: టాప్ 5 బెస్ట్ ఫేస్ స్క్రబ్స్.. ఎండకాలం మీ ముఖానికి కాంతివంతంగా చేస్తుంది..
పుదీనా ఆకులను కాడల నుంచి తీయాలి. ఇప్పుడు ఓ స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం గ్రైండర్లో ఓ గుప్పెడు పుదీనా ఆకులు, నానబెట్టిన మెంతులను నీటితో సహా పేస్టు మాదిరి రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు బాగా పట్టించాలి. ఆరిన తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఈ 6 బ్రేక్‌ఫాస్ట్స్ కాంబినేషన్స్ తీసుకుంటే నెలలో బరువు ఈజీగా తగ్గిపోతారు..
ఇలా పుదీనాతో జుట్టుకు హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు గరుకుదనం తగ్గిపోతుంది. పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది. ముఖ్యంగా పుదీనా హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టులో రక్తప్రసరణను మెరుగు చేస్తుంది. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడిన చోట కూడా పెరుగుతుంది. ఊడటం ఆగిపోతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ లో కలబంద కూడా వేసుకోని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పుదీనా హెయిర్ ప్యాక్ ను కనీసం వారానికి ఒకసారి అయినా వేసుకోండి. జుట్టు అందంగా , పొడుగ్గా పెరుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook